Paper Leak Bill: పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్లు జైలు, రూ. 10 కోట్ల జరిమానా.. ఆమోదించిన కేబినెట్..

  • పేపర్ లీక్‌లపై సవరించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం.
  • దోషులకు 10 ఏళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా ప్రతిపాదన.
  • పేపర్ లీక్ కేసుల కోసం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు.
  • మూడు నెలల్లో విచారణ పూర్తి చేసేలా నిబంధనలు.
Pm Modi

Pm Modi

Paper Leak Bill: నీట్ పేపర్ లీక్, సీజేపీ నిరసన నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ సహా వివిధ పోటీ పరీక్షా పశ్నాపత్రాల లీకేజీలను అడ్డుకునేందుకు ‘‘పబ్లిక్ ఎగ్జామినేషన్(సవరణ) బిల్లు’’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపారు. వచ్చే వారం ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

సవరించిన బిల్లు ప్రకారం, ఎవరైనా పేపర్ లీక్ చేస్తే గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, రూ. 10 కోట్ల వరకు జరిమానా విధించే నిబంధనల్ని చేర్చారు. ఇదే కాకండా పేపర్ లీక్ కేసుల్ని విచారించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కోర్టులు మూడు నెలల్లో విచారణ పూర్తి చేసి తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది.

ఒకవైపు కొత్త చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలుపుతున్న సమయంలోనే మరోవైపు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో కేంద్రం, సీజేపీ మధ్య చర్యలు ప్రారంభమయ్యాయి. సీజేపీ ప్రధానంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నిరసనల్లో పాల్గన్న విద్యార్థులపై పెట్టి కేసుల ఉపసంహరణ, నీట్ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. 1 కోటి పరిహారం అనే మూడు డిమాండ్లను కేంద్రం ముందుంచింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మినహా మిగిలిన రెండు డిమాండ్లకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. మంత్రి రాజీనామా డిమాండ్‌పై ఒక రోజు కేంద్ర సమయం కోరింది. ఇదిలా ఉంటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే ఉద్యమం ఆపుతామని సీజేపీ స్పష్టం చేసింది.