Site icon NTV Telugu

Union Budget 2025: ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్.. వీటిపై గంపెడు ఆశలు పెట్టుకున్న ప్రజలు..!

Budjet

Budjet

Union Budget 2025 Expectations: 2025 కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 11:00 గంటలకు లోక్ సభలో సమర్పించనున్నారు. మొత్తంగా ఇది ఆమె ఎనిమిదో బడ్జెట్ ప్రసంగం అవుతుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు భాగాలుగా కొనసాగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు.. ఆ తర్వాత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి.

Read Also: THEATRE : రాత్రి 11 గంటల తర్వాత థియేటర్లలో వారికి నో ఎంట్రీ..

కాగా, ఈ సంవత్సరం ప్రవేశ పెట్టనున్న యూనియన్ బడ్జెట్‌ కోసం ఉద్యోగులు, ట్యాక్స్ పేయర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్లతో బడ్జెట్ పన్ను మినహాయింపు దక్కుతుందని చాలా మంది ఆశిస్తున్నారు. టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ రంగాల్లో ఆర్థిక వృద్ధి, ఉద్యోగ కల్పనకు ప్రకటనలు వెలువడుతాయని భావిస్తున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ సమీపిస్తుండటంతో.. 2025 బడ్జెట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read Also: DGP Dwaraka Tirumala Rao: టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నాం.. మార్చి లోపు లక్ష కెమెరాలు ఏర్పాటు..

పన్ను మినహాయింపులు
ప్రస్తుతం రూ.3 లక్షల వరకు సంపాదిస్తున్న వ్యక్తులకు కొత్త పన్ను విధానంలో బేసిక్‌ ఎగ్జమ్షన్‌ లిమిట్‌ను రూ.5 లక్షలకు పెంచుతారని ఆర్థిక నిపుణలు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రజల దగ్గర డిస్పోజబుల్‌ ఇన్‌కమ్‌ పెరిగే అవకాశం.

మధ్యతరగతి ప్రజలకు పన్ను రాయితీ పెంపు..
ప్రస్తుతం రూ.7 లక్షల వరకు సంపాదిస్తున్న వ్యక్తులు పూర్తి స్థాయిలో పన్ను రాయితీని పొందుతున్నారు. 2025 బడ్జెట్‌లో ఈ లిమిట్‌ను రూ.9 లక్షలకు పెంచే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు ఆశిస్తున్నారు. అలాగే, రూ.15 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి తక్కువ పన్ను రేట్లను ప్రవేశ పెట్టాలనే డిమాండ్లు కూడా వస్తున్నాయి.

క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌లో మార్పులు
ఈక్విటీపై లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌కి సవరణలు ఉండే అవకాశం. పెట్టుబడిదారులు రాబడిని పెంచుకోవడానికి సహాయపడేందుకు లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ లిమిట్‌ను రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ పెంచుతారని ప్రజలు ఆశిస్తున్నారు.

హోమ్ లోన్ ఇంట్రెస్ట్‌ డిడక్షన్‌
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 24(బీ) ప్రకారం, ట్యాక్స్ పేయర్లు ప్రస్తుతం హౌసింగ్ లోన్ వడ్డీపై గరిష్టంగా రూ.2 లక్షల వరకు డిడక్షన్‌ పొందుతున్నారు. ఈ లిమిట్‌ను రూ.3 లక్షలకు పెంచడం లేదా సింగిల్‌ ప్రాపర్టీ వడ్డీ చెల్లింపులకు ఫుల్‌ డిడక్షన్‌ అందిస్తారని సమాచారం. హయ్యర్‌ డిడక్షన్స్ కారణంగా ఇళ్లకు కేటాయించే ఖర్చులు తగ్గిపోతాయి.. అలాగే, పన్ను చెల్లింపుదారులకు డబ్బు ఆదా అవుతుందని ఆర్థిక నిపుణుల వెల్లడి.

NPS పెట్టుబడులపై ట్యాక్స్‌ ఫ్రీ లిమిట్‌
నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద ప్రస్తుతం రూ.50,000 రిటర్న్స్‌పై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పదవీ విరమణ కోసం పొదుపు చేసుకునేలా ఎక్కువ మందిని ప్రోత్సహించేందుకు ఈ లిమిట్‌ను కేంద్రం పెంచవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అలానే, విత్‌డ్రా రూల్స్‌ మరింత ఫ్లెక్సిబుల్‌గా మారుస్తారని టాక్.

పలు రంగాలకు భారీ ప్రోత్సాహకాలు
ఆరోగ్య సంరక్షణ, పునరుత్పాదక ఇంధనం, నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడుల కోసం ప్రభుత్వం పన్ను ప్రయోజనాలను ప్రవేశ పెట్టవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

చిన్న వ్యాపారాలకు సపోర్ట్
చిన్న వ్యాపారాలు, వృత్తి నిపుణులకు సెక్షన్‌ 44ఏడీ, 44 ఏడీఏ కింద ప్రిజమ్టివ్‌ ట్యాక్స్‌ లిమిట్‌ పెంచుతారని ఆర్థిక నిపుణులు ఆశిస్తున్నారు. ఇది ట్యాక్స్‌ ఫైలింగ్‌, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ని మరింతగా ఇంప్రూవ్‌ చేస్తుంది.

Exit mobile version