NTV Telugu Site icon

PM Modi: ఎమర్జెన్సీ చీకటి రోజులు.. మరిచిపోలేని కాలం అంటూ ప్రధాని ట్వీట్..

Pm Modi

Pm Modi

PM Modi: భారతదేశంలో చీకటి అధ్యాయానికి నేటితో 48 ఏళ్ల నిండాయి. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించింది. దీంతో ఈ చర్యను నిరసిస్తూ బీజేపీ, ఆ నాటి రోజుల్ని వ్యతిరేకించిన వారికి నివాళులు అర్పిస్తోంది. 21 నెలల కాలంలో మన దేశ చరిత్రలో మరిచిపోలేని కాలంమని, ఇది రాజ్యాంగ విలువలకు పూర్తిగా వ్యతిరేకం అని ప్రధాని అన్నారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు, ఇతర బీజేపీ నేతలు ఆ నాటి ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ, కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారు.

Read Also: Project k : సినిమాలో కమల్ హాసన్ నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన మేకర్స్..

‘‘ ఎమర్జెన్సీని ఎదిరించి, మన ప్రజాస్వామ్య స్ఫూర్తిని పటిష్టం చేసేందుకు కృషి చేసిన ధైర్యవంతులందరికీ నేను నివాళులర్పిస్తున్నాను. #DarkDaysOfEmergency మన చరిత్రలో ఒక మరపురాని కాలంగా మిగిలిపోయింది, మన రాజ్యాంగం జరుపుతున్న విలువలకు పూర్తి విరుద్ధంగా ఉంది’’ అని ప్రధాని ఆరోపించారు. బీజేపీ ఇందిరాగాంధీ ఫోటోతో ‘‘భారత ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యాయం’’ అని పోస్టర్ ని ట్వీట్ చేసింది.

కేంద్ర మంత్రి ఎమర్జెన్సీపై 5 నిమిషాల వీడియోను ట్వీట్ చేశారు. ఎమర్జెన్సీకి దారి తీసిన సంఘటనలను వివరించేలా వీడియో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ క్రూరత్వాన్ని ఆరోపించింది. పత్రికా స్వేచ్ఛ, న్యాయవ్యవస్థను అణిచివేసినట్లుగా ఈ వీడియో పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ సత్తా ఏమిటో చూడండి అంటూ వ్యంగ్యంగా ఆరోపణలు గుప్పించారు. నిరంకుశ పాలకులు ప్రకటించిన ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యం, మానవ హక్కులను దెబ్బతీశాయిన, ఇది ఒక నిర్దిష్ట కుటుంబం, రాజకీయ పార్టీ అహంకారం, అధికారాన్ని అంటిపెట్టుకోవాలనే కోరిక అంటూ మరో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ట్వీట్ చేశారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, కిరణ్ రిజిజు, ప్రహ్లాద్ జోషి, నితిన్ గడ్కరీ ఎమర్జెన్సీపై ట్వీట్ చేశారు.