Site icon NTV Telugu

Umar: ఢిల్లీ బ్లాస్ట్‌కు ముందు ఏం జరిగింది.. వెలుగులోకి ఉమర్ సంచలన వీడియో

Umar

Umar

ఢిల్లీ బ్లాస్ట్‌ తర్వాత అనేక కథనాలు వెలువడ్డాయి. కొందరు ఆత్మాహుతి దాడి అని.. ఇంకొందరు పొరపాటున కారు బ్లాస్ట్ జరిగిందని వాదనలు వినిపించాయి. ఇలా రకరకాలైన కథనాలు వచ్చాయి. వీటిన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ ఉగ్రవాది డాక్టర్ ఉమర్‌కు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

ఢిల్లీ బ్లాస్ట్‌కు ముందు డాక్టర్ ఉమర్‌కు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో స్పష్టంగా ఆత్మాహుతి దాడి గురించి ప్రస్తావించాడు. ఆత్మాహుతి దాడి గురించి తప్పుడు భావన ఉందని పేర్కొన్నాడు. ఆత్మాహుతి వాదనేలేదని.. దాన్ని బలిదాన చర్యగా అభివర్ణించాడు. ఇస్లాంలో ఆత్మాహుతి దాడి లేదని.. బాలిదానపు ఆపరేషన్‌గా వివరించాడు. అమరవీరుల ఆపరేషన్‌గా కూడా పేర్కొన్నాడు. ఈ వీడియోలో పూర్తిగా ఇంగ్లీష్‌లో మాట్లాడాడు.

ఇది కూడా చదవండి: Al-Falah University: అల్-ఫలాహ్ వర్సిటీలో ఈడీ దాడులు.. 25 చోట్ల ఏకకాలంలో సోదాలు

ఒక నిర్దిష్ట ప్రదేశం, సమయంలో చనిపోతానని భావించినప్పుడు.. సహజ మరణానికి వ్యతిరేకంగా జరిగేదాన్ని ఆత్మాహుతి దాడి కాదని.. దాన్ని బలిదాన ఆపరేషన్‌గా తెలిపాడు. దీనిపై భిన్నమైన వాదనలు, వైరుధ్యాలు కూడా ఉన్నట్లు చెప్పాడు. ఒక నిర్దిష్ట పరిస్థితిలో చనిపోతే మాత్రం బలిదానం ఆపరేషన్ అంటారని చెప్పాడు. వీడియోలో ఉమర్ మాట్లాడుతున్న విధానాన్ని చూస్తుంటే.. సహచర ఉగ్ర డాక్టర్ల బ్రెయిన్ వాష్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. సహచరులు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఉండేందుకు ఉమర్ ఉద్దేశపూర్వకంగానే ఈ వీడియో చేసినట్లుగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Delhi Car Blast: వామ్మో.. ఉగ్రవాదులు ఒళ్లు గగుర్పొడిచే ప్లాన్.. వెలుగులోకి కొత్త ప్రణాళిక!

పాకిస్థాన్‌కు చెందిన జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాద సంస్థ మైకంలో పడిన డాక్టర్లు పూర్తిగా ఉగ్రవాదులుగా మారిపోయారు. మొత్తం వారి బ్రెయిన్ ఉగ్రవాదం వైపునకు మళ్లినట్లు కనిపిస్తోంది. టెర్రర్ మాడ్యూల్‌లో మొత్తం 10 మంది సభ్యులు ఉన్నారని.. వారిలో ఐదు నుంచి ఆరుగురు వైద్యులు ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. అల్-ఫలాహ్ యూనివర్సిటీ నుంచి పేలుడు పదార్థాలు, రసాయనాలు స్వాధీనం చేసుకున్న తర్వాత అధికారులు అవగాహనకు వచ్చారు. తాజా వీడియోలో ఉమర్ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే.. ఆత్మాహుతి దాడి అని కాకుండా.. దానికి బలిదాన ఆపరేషన్‌గా పేర్కొంటున్నాడు. అంటే ఢిల్లీ బ్లాస్ట్ కచ్చితంగా ఆత్మాహుతి దాడిగానే చెప్పొచ్చు. కేవలం దాని అర్థం మాత్రమే మార్చాడు. మిగతాదంతా సేమ్ టు సేమ్.

ఉమర్ ఎవరు?
డాక్టర్ ఉమర్ పుల్వామాలోని కోయిల్ గ్రామవాసి. ఎంబీబీఎస్ కోసం గంటల తరబడి చదివేవాడని బంధువులు పేర్కొన్నారు. చాలా నిశ్శబ్దంగా ఉండేవాడని తెలిపారు. అయితే పోలీస్ వర్గాల ప్రకారం.. ఉమర్ ప్రవర్తన ఇటీవల కాలంలోనే మారిపోయినట్లుగా భావిస్తున్నారు. అక్టోబర్ 30 నుంచి యూనివర్సిటీ విధులకు దూరంగా ఉంటున్నాడు. ఫరీదాబాద్ నుంచి ఢిల్లీ చుట్టూ అనేకమార్లు ప్రయాణం చేశాడు. ఈ సమయంలోనే రాంలీలా మైదాన్, సునేహ్రీ మసీదు, దాని సమీపంలోని మసీదులను సందర్శించాడు.

నవంబర్ 9న ఫరీదాబాద్‌లోని ఒక గిడ్డంగి దగ్గర నుంచి 2,900 కిలోల అమ్మోనియం నైట్రేట్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొంత మంది డాక్టర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ వార్త తెలియగానే ఉమర్ అదృశ్యమయ్యాడు. హర్యానాలోని ధౌజ్ గ్రామం సమీపంలో అజ్ఞాతంలోకి వెళ్లాడని, ఐదు ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. అనంతరం నవంబర్ 10న ఎర్రకోట దగ్గర పేలిన కారు బ్లాస్ట్‌లో ఉమర్‌తో పాటు మరో 13 మంది చనిపోయారు. ఇక ఫరీదాబాద్‌లో అరెస్టైన డాక్టర్ ముజమ్మిల్ పలుమార్లు టర్కీకి వెళ్లివచ్చినట్లుగా అధికారులు కనుగొన్నారు.

Exit mobile version