Asaduddin Owaisi: 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో కీలక నిందితులుగా ఉన్న ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. అయితే, దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ అని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపిస్తున్నారు. ఢిల్లీ అల్లర్లలో పెద్ద కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరికి అత్యున్నత న్యాయస్థానం బెయిల్ ఇవ్వకపోవడంపై చర్చ నడుస్తోంది.
Read Also: Greenland issue: గ్రీన్‌లాండ్ ప్రజలకు ట్రంప్ బంపర్ ఆఫర్.. డెన్మార్క్ నుంచి విడదీసే ప్లాన్..
‘‘చట్టవిరుద్ధ కార్యకలాపాల(నివారణ) చట్టం(UAPA)’’ కారణంగానే వీరిద్దరు జైలులో ఉన్నారు. ఈ చట్టంలో నిబంధనల్ని మరింత బలోపేతం చేయడంలో కాంగ్రెస్ పాత్ర ఉందని అన్నారు. పి. చిదంబరం కేంద్ర హోం మంత్రిగా ఉన్నప్పుడు, ఈ చట్టానికి సవరణలు ప్రవేశపెట్టారు. దీని ఫలితంగానే చాలా ఏళ్లుగా జైలులో ఉన్న ఖలీద్, ఇమామ్‌లతో సహా విచారణలో ఉన్న ఖైదీలు దీర్ఘకాలికంగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
“సుప్రీంకోర్టు ఇద్దరు అండర్ ట్రయల్ నిందితులకు బెయిల్ మంజూరు చేయలేదు, బెయిల్ ఎందుకు మంజూరు చేయలేదో వివరించింది. యుపిఎ ప్రభుత్వ హయాంలో, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టాన్ని సవరించారు, అందులో ఉగ్రవాదం అంటే ఏమిటో నిర్వచనాన్ని చేర్చారు” అని ఓవైసీ అన్నారు. 2007-08లలో ఈ చట్టంలోని సెక్షన్ 15(ఏ) గురించి మాట్లాడినట్లు ఓవైసీ గుర్తు చేసుకున్నారు.
