Aadhaar Card Alert: అన్నింటికీ ఆధారే ఆదారం.. ప్రభుత్వ, ప్రైవేట్ అనే సంబంధం లేకుండా ఏ కార్యాలయానికి.. ఏ పని మీద వెళ్లినా.. ఆధార్ కార్డు అడుగుతున్నారు.. అయితే, ఆధార్ కార్డుపై కొన్ని అపోహలు కూడా ఉన్నాయి.. ఆధార్ కార్డును మిస్ యూజ్ చేసే అవకాశం ఉండడంతో.. అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.. ఇక, ఈ మధ్య ఓ వార్త వైరల్‌గా మారిపోయింది.. యూఐడీఏఐ పేరుతో వైరల్ అవుతున్న ఆ మెసేజ్‌లో ఆధార్ కార్డుదారులు తమ ఆధార్ సంబంధిత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని, ప్రభుత్వ పథకం కోసం అయినా సరే తమ ఆధార్ కార్డుకు సంబంధించిన జిరాక్స్‌లు సైతం ఇవ్వకూడదు.. అనేది దాని సారాశం.. ఆధార్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు సోషల్ మీడియాలో ఓ మెసేజ్ హల్‌చల్ చేస్తోంది.. దీంతో, దీనిపై క్లారిటీ ఇచ్చింది యూఐడీఏఐ..
Read Also: Warangal Preethi Case: డిసెంబర్ నుంచే ప్రీతికి వేధింపులు.. సైఫ్ టార్గెట్ చేశాడు
వైరల్‌గా మారిన ఆ మెసేజ్ ఫేక్‌గా నిర్ధారించింది యూఐడీఏఐ.. కేంద్ర ప్రభుత్వం అటువంటి ఉత్తర్వులేవీ జారీ చేయలేదని, అందులో ఇచ్చిన యూఐడీఏఐ లింక్ కూడా తప్పు అని స్పష్టం చేసింది.. ఆధార్ గురించి విశ్వసనీయ సమాచారాన్ని పొందడానికి, వినియోగదారులు ఎల్లప్పుడూ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.. uidai.gov.in అని పేర్కొంది.. యూఐడీఏఐ నిరంతరం తమ ఆధార్ వివరాలను భద్రపరచాలని మరియు అనధికార సంస్థలతో వాటిని పంచుకోవద్దని ప్రజలను కోరుతుంది. వారు వ్యక్తిగత సమాచారాన్ని ఎలా భద్రపరచాలి మరియు మోసాన్ని నిరోధించడం గురించి మార్గదర్శకాలను కూడా అందిస్తూనే ఉన్నాం.. యూఐడీఏఐ నుండి వచ్చినట్లు క్లెయిమ్ చేసే సందేశాలు లేదా ఈమెయిల్‌ల పట్ల వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి.. వాటిపై చర్య తీసుకునే ముందు అటువంటి సందేశాల యొక్క ప్రామాణికతను ధృవీకరించాలని సూచించింది.
Read Also: Simbu: ప్రియరాళ్లకు పెళ్లిలు చేసి.. పెళ్లి పీటలు ఎక్కుతున్న స్టార్ హీరో..?
మరోవైపు.. యూఐడీఏఐ నుంచి వచ్చిన సందేశం అంటూ వైరల్‌గా మారిన ఆ సందేశాన్ని ఆధార్ కార్డ్ హోల్డర్లు పంచుకోవద్దని హెచ్చరించింది. ప్రభుత్వం అటువంటి సలహా ఏదీ జారీ చేయలేదు మరియు ఆధార్ సంబంధిత విషయాలపై ఖచ్చితమైన సమాచారం కోసం వినియోగదారులు uidai.gov.in వంటి అధికారిక వనరులపై ఆధారపడాలి. వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడం మరియు మోసాన్ని నిరోధించడం గురించి అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం అని సూచించింది యూఐడీఏఐ..