Bans Aadhaar Xerox: వ్యక్తిగత ధృవీకరణ పేరుతో హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, ఈవెంట్ సంస్థల్లో ఎడాపెడా ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను సేకరించే పద్ధతికి ఉడాయ్ ఇక చెక్ పెట్టబడుతోంది. ఇక నుంచి ఆధార్ కార్డుల జిరాక్స్ పత్రాలను అడగడానికి సంబంధిత సంస్థలు నిర్దిష్టంగా UIDAI దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే అని తేల్చి చెప్పింది. రిజిస్ట్రేషన్ లేని ఏ సంస్థ కూడా ఆధార్ ఫోటోకాపీలు తీసుకునే అధికారం లేదని హెచ్చరించింది.
Read Also: Telangana Rising Global Summit 2025: నేటి నుంచే గ్లోబల్ సమ్మిట్ షురూ.. షెడ్యూల్ ఇదే..
ఇక, UIDAI సీఈవో భువనేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఆధార్ కార్డుల ధృవీకరణకు కొత్త టెక్నాలజీని ప్రవేశ పెడుతున్నట్లు వెల్లడించారు. ఇక నుంచి సంస్థలు వినియోగదారుల ఆధార్‌ను QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా గానీ, కొత్త ఆధార్ యాప్ ద్వారా గానీ ధృవీకరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వ్యక్తుల ఆధార్ జిరాక్స్ లను అడగడానికి పర్మిషన్ లేదని, ఆ పద్ధతిని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఇక, జిరాక్స్ తీసుకోవాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. ఒకవేళ ఏ సంస్థకైనా ప్రత్యేక కారణాల వల్ల నిజంగానే ఆధార్ కాపీలు అవసరం అయితే.. వారు తప్పనిసరిగా UIDAI వద్ద రిజిస్టర్ కావాల్సి ఉందన్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా ఆధార్ జిరాక్స్ సేకరణ పూర్తిగా అక్రమం అవుతుంది అని UIDAI సీఈవో భువనేశ్ కుమార్ చెప్పారు.
