NTV Telugu Site icon

PM Modi: ఉదయనిధి “సనాతన” వ్యాఖ్యలపై స్పందించిన ప్రధాని మోడీ..

Pm Modi

Pm Modi

PM Modi: తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదం అయ్యాయి. ముఖ్యంగా బీజేపీ డీఎంకే పార్టీని, ఇండియా కూటమిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ఇండియా కూటమి హిందూమతాన్ని ద్వేషిస్తోందని, ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. మరోవైపు కాంగ్రెస్ తాము అన్ని మతాలను సమానం చూస్తామని ప్రకటించింది.

Read Also: Lalu Prasad Yadav: వేపపుల్లలో ఇండియా, భారత్‌ల మధ్య తేడాను వివరించిన లాలూ.. ఓల్డ్ వీడియో వైరల్..

ఇదిలా ఉంటే ఉదయనిధి వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించినట్లు తెలుస్తోంది. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు సరైన సమాధానం చెప్పాలని బుధవారం అన్నారు. న్యూఢిల్లీలో జీ20 సదస్సుకు ముందు జరిగిన మంత్ర మండలి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘చరిత్రలోకి వెళ్లవద్దు, కానీ రాజ్యాంగం ప్రకారం వాస్తవాలకు కట్టుబడ ఉండంది. సమస్య యొక్క సమకాలిక పరిస్థితుల గురించి మాట్లాడండి’’ అని ప్రధాని అన్నారు. ఇండియా వర్సెస్ భారత్ వివాదంపై వ్యాఖ్యానించవద్దని మంత్రులకు ప్రధాని సలహా ఇచ్చారు. తగిన వ్యక్తి మాత్రమే ఈ విషయంపై మాట్లాడాలని అన్నారు.

తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. సనాతన ధర్మం డెంగీ, మలేరియా వంటిదని దాన్ని నిర్మూలించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై వివాదం చెలరేగింది. అయితే తన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరిస్తోందని ఆయన విమర్శించారు. తన వాదనలకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. సనాతన ధర్మం అననుసరించే వ్యక్తలుపై హింసకు తాను పిలుపునివ్వలేదని అన్నారు. ఇదిలా ఉంటే ఈ వ్యాఖ్యలపై బీజేజీ మాట్లాడుతూ.. ఉదయనిధి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అతడిని హిట్లర్ తో పోల్చింది. కాంగ్రెస్ తన వైఖరి చెప్పాలంటూ డిమాండ్ చేసింది.