Sanatana Dharma: పవన్ కళ్యాణ్ VS ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మంపై రగడ..
- సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు..
- స్పందించిన తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్..
- పవన్ టార్గెట్‌గా డీఎంకే నేతల విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanatana Dharma: సనాతన ధర్మంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, సినీనటుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో గురువారం తిరుపతిలో జరిగిన ‘‘వారహి డిక్లరేషన్’’ బహిరంగ సభలో ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడారు. గతేడాది సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోలుస్తూ, దానిని తుడిచేయాలని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పలువురు ధ్వజమెత్తారు. అయితే, ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ పరోక్షంగా స్పందిస్తూ ఉదయనిధిపై విమర్శలు చేశారు.
Read Also: Jaishankar Pakistan Tour: పదేళ్ల తర్వాత పాకిస్థాన్‌కు భారత్ విదేశాంగ మంత్రి.. ఎందుకంటే?
Also Read
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఉదయనిధి స్టాలిన్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు. ఎవరైనా సనాతన ధర్మాన్ని తుడిచేయాలని ప్రయత్నిస్తే, వారే తుడిచిపెట్టుకుపోతారని అన్నారు. ‘‘సనాతన ధర్మం వైరస్ లాంటిదని అనకండి.. అది నాశనం అవుతుందనే మాటలు చెప్పకండి సార్.. మీరు సనాతన ధర్మాన్ని తుడిచేయలేరు. ఎవరైనా సనాతన ధర్మాన్ని తుడిచేయాలని ప్రయత్నిస్తే, వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద నుంచి తుడిచిపెట్టుకుపోతారు’’ అని తిరుపతి సభలో పవన్ అన్నారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి సనాతన పరిరక్షణ బోర్డుల్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో ఇందుకు అనుగుణంగా చట్టం తీసుకురావాలని కోరారు.
అయితే, పవన్ కళ్యాణ్ ఎవరి పేరు చెప్పనప్పటికీ తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే నేతలు మాత్రం రెచ్చిపోతున్నారు. పవన్ టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు. పవన్ నిన్న చేసిన వ్యాఖ్యలకు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. సనాతన ధర్మాన్ని విమర్శిస్తే తుడిచిపెట్టుకుపోతారనే వ్యాక్యలపై స్పందిస్తూ.. వేచి చూద్ధాం(లెట్స్ వెయిట్ అంటూ సీ) అని ఉదయనిధి రిప్లై ఇచ్చారు. డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్ పవన్ కళ్యాణ్, బీజేపీని విమర్శించారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే వారు తమిళనాడు నుంచి తుడిచిపెట్టుకుపోయారని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
BAN vs AUS: ఆసీస్‌కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్‌కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!