NTV Telugu Site icon

Sanatana Dharma: పవన్ కళ్యాణ్ VS ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మంపై రగడ..

Udhayanidhi Stalin

Udhayanidhi Stalin

Sanatana Dharma: సనాతన ధర్మంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, సినీనటుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో గురువారం తిరుపతిలో జరిగిన ‘‘వారహి డిక్లరేషన్’’ బహిరంగ సభలో ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడారు. గతేడాది సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోలుస్తూ, దానిని తుడిచేయాలని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పలువురు ధ్వజమెత్తారు. అయితే, ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ పరోక్షంగా స్పందిస్తూ ఉదయనిధిపై విమర్శలు చేశారు.

Read Also: Jaishankar Pakistan Tour: పదేళ్ల తర్వాత పాకిస్థాన్‌కు భారత్ విదేశాంగ మంత్రి.. ఎందుకంటే?

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఉదయనిధి స్టాలిన్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు. ఎవరైనా సనాతన ధర్మాన్ని తుడిచేయాలని ప్రయత్నిస్తే, వారే తుడిచిపెట్టుకుపోతారని అన్నారు. ‘‘సనాతన ధర్మం వైరస్ లాంటిదని అనకండి.. అది నాశనం అవుతుందనే మాటలు చెప్పకండి సార్.. మీరు సనాతన ధర్మాన్ని తుడిచేయలేరు. ఎవరైనా సనాతన ధర్మాన్ని తుడిచేయాలని ప్రయత్నిస్తే, వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద నుంచి తుడిచిపెట్టుకుపోతారు’’ అని తిరుపతి సభలో పవన్ అన్నారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి సనాతన పరిరక్షణ బోర్డుల్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో ఇందుకు అనుగుణంగా చట్టం తీసుకురావాలని కోరారు.

అయితే, పవన్ కళ్యాణ్ ఎవరి పేరు చెప్పనప్పటికీ తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే నేతలు మాత్రం రెచ్చిపోతున్నారు. పవన్ టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు. పవన్ నిన్న చేసిన వ్యాఖ్యలకు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. సనాతన ధర్మాన్ని విమర్శిస్తే తుడిచిపెట్టుకుపోతారనే వ్యాక్యలపై స్పందిస్తూ.. వేచి చూద్ధాం(లెట్స్ వెయిట్ అంటూ సీ) అని ఉదయనిధి రిప్లై ఇచ్చారు. డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్ పవన్ కళ్యాణ్, బీజేపీని విమర్శించారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే వారు తమిళనాడు నుంచి తుడిచిపెట్టుకుపోయారని ఎద్దేవా చేశారు.