Udhayanidhi Stalin: “మా మంత్రులంతా డిప్యూటీ సీఎంలే”.. పదవిపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు..

  • ఉప ముఖ్యమంత్రి పదవిపై స్పందించిన ఉదయనిధి స్టాలిన్..
  • మా మంత్రులంతా డిప్యూటీ సీఎంలే అని వ్యాఖ్యలు..
  • 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమంటూ కామెంట్స్..
Udhayanidhi Stalin

Udhayanidhi Stalin

Udhayanidhi Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కి మంత్రి వర్గంలో ప్రమోషన్ వస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పటికే డీఎంకే పార్టీ యూత్ వింగ్ సెక్రటరీగా ఉన్న ఉదయనిధి, స్టాలిన్ కేబినెట్లో మంత్రిగా కూడా ఉన్నారు. అయితే, త్వరలోనే మంత్రివర్గంలో ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా ప్రకటిస్తారనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అయితే, తాజాగా ఈ వార్తలపై ఆయన స్పందించారు. ఈ ఊహాగానాలకు సమాధానంగా మాట్లాడుతూ.. డీఎంకే ప్రభుత్వంలోని మంత్రులంతా డిప్యూటీ సీఎంలే అని అన్నారు.

Read Also: Ambani Wedding: పెళ్లిని ప్రమోట్ చేయడానికి భారీ మొత్తం ఆఫర్.. కానీ నిరాకరించిన ఇన్‌ఫ్లుయెన్సర్..

‘‘ ఉపముఖ్యమంత్రి పదవిపై చాలా వార్తలు వస్తున్నాయి. మా ప్రభుత్వంలోని మంత్రులంతా ఉప ముఖ్యమంత్రులే అని నేను ముందే చెప్పాను’’ అని ఆయన అన్నారు. , యువజన విభాగం కార్యదర్శి పదవి తనకు ఇష్టమైన పదవి అని చెప్పారు. 2026 అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో లాగా పనిచేసి విజయం సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. 2026 ఎన్నికలే మా లక్ష్యమని చెప్పారు. ఏ కూటమి వచ్చిన తమ నాయకుడు స్టాలిన్‌ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా డీఎంకే కూటమి విజయం సాధిస్తుందని చెప్పారు. సోషల్ మీడియాలో యువజన కార్యకర్తలు ఉదయం, సాయంత్రం రోజుకు 10 నిమిషాలు కేటాయించాలని సలహా ఇచ్చారు.