Udhayanidhi Stalin: గతేడాది డీఎంకే పార్టీ నేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, క్యాబినెట్ మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపాయి. బీజేపీ ఈ వ్యాఖ్యల్ని తప్పు పట్టింది. దేశవ్యాప్తంగా పలు చోట్లు హిందువులు తమ మనోభావాలను దెబ్బతీశాడని చెబుతూ.. ఉదయనిధిపై కేసులు పెట్టారు.
Read Also: Bhatti Vikramarka: గిరిజనులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ధరణితో భూములు కోల్పోతే..!
ఇదిలా ఉంటే, బెంగళూర్ కోర్టు ఉదయనిధికి సమన్లు జారీ చేసింది. బెంగళూర్ వాసి పరమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు మంత్రికి సమన్లు జారీ చేసింది. మార్చి 4న జరగనున్న విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు సమన్లలో పేర్కొంది. ఉదయనిధి స్టాలిన్ గతేడాది ఓ కార్యక్రమం మాట్లాడుతూ.. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియాతో పోల్చాడు, దాన్ని నిర్మూలించాని పిలుపునిచ్చాడు. సెప్టెంబరు 2023లో జరిగిన ఒక సదస్సులో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, సనాతన ధర్మం సామాజిక న్యాయం మరియు సమానత్వానికి విరుద్ధమని, దానిని నిర్మూలించాలని అన్నారు.
