సాధారణంగా మన దేశంలో పాస్ పోర్ట్ అనగానే కేవలం బ్లూ కలర్ లో మాత్రమే ఉంటుందనుకుంటాం.. కదా.. కానీ… అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. మన ఇండియాలో నాలుగు రకాల అంటే నాలుగు రంగులలో పాస్ పోర్ట్ లు ఉన్నాయి. ఒక్కొక్కదానకి ఒక పర్పస్ ఉంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. మన దేశంలో నాలుగు రంగుల్లో పాస్ పోర్ట్ లను అందిస్తోంది. ప్రభుత్వం .. అవి ఏంటంటే… విదేశాల్లో చదవాలనుకున్నా.. టూర్ వెళ్లి రావాలనుకున్నా.. లేదా ఉద్యోగం, వ్యాపారం చేయాలనుకున్నా.. దేశాన్ని దాటించి ఇబ్బందులు లేకుండా కాపాడే ఏకైక అధికారిక గుర్తింపు కార్డు పాస్ పోర్టు. ఇండియన్ పాస్ పోర్టు బ్లూ కలర్ లో ఉంటుందని అందరిలో ఉన్న అవగాహన. కానీ బ్లూ ఒక్కటే కాదు.. ఇండియాలో నాలుగు రకాల పాస్ పోర్టులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
బ్లూ పాస్ పోర్టు ..ఇది రెగ్యులర్ గా.. ఎక్కువ మందికి జారీ చేసే ఆర్డినరీ పాస్ పోర్టు. విద్య, ఉద్యోగం, టూర్, వ్యాపారం తదితర అవసరాల మేరకు ఈ బ్లూ పాస్ పోర్టు జారీ చేస్తుంటారు. లక్షల మంది భారతీయుల దగ్గర ఈ పాస్ పోర్టు ఉంటుంది. ఇప్పుడు ఇది e-passport రూపలో కూడా అందుబాటులో ఉంది.
ఈ కామన్ పాస్ పోర్టు కావాలంటే ఇండియన్ సిటిజన్ అయ్యుండాలి. ఇండియాలో పుట్టి ఉండాలి. దీని కోసం ఆధార్, పాన్ కార్డు, అడ్రెస్ ప్రూఫ్, బర్త్ ప్రూఫ్ అవసరం. సమీప పాస్ పోర్టు కేంద్రంలో అప్లై చేసుకుంటే పోలీస్ వెరిఫికేషన్ తర్వాత అర్హులైతే జారీ చేస్తారు.
తెల్ల రంగులో ఉండే మరో పాస్ పోర్టు ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు, సివిల్ సర్వెంట్స్, సైనిక బలగాలకు ఇది మంజూరు చేస్తారు. ఈ పాస్ పోర్టు ఉంటే ఇమిగ్రేషన్ ప్రాసెస్ చాలా తొందరగా పూర్తవుతుంది.
ఎరుపు రంగు లేదా మెరూన్ కలర్ లో ఉండే పాస్ పోర్టును డిప్లొమాటిక్ సేవలకు.. అంటే విదేశాలతో దౌత్య సంబంధాలు నిర్వహించే అధికారులు, ఫారెన్ సర్వీసెస్ అధికారులు (గ్రూప్ A), విదేశాంగ శాఖలో పనిచేస్తున్న అధికారులు (గ్రూప్ B) సీనియర్ గవర్నమెంటు అధికారులు, వారి కుటుంబ సభ్యులకు మంజూరు చేస్తారు. విదేశాల్లో పనిచేసే అధికారులతో పాటు భారత దౌత్య సంబంధాల్లో భాగంగా విదేశాల్లో నివసిస్తున్న అధికారులకు ఈ పాస్ పోర్టు ఇస్తారు.
ఆరెంజ్ పాస్ పోర్టును 2018 నుంచి ఇవ్వడం లేదు. 10 వ తరగతి మించి విద్యార్హత లేని వాళ్లకు ఈ పాస్ పోర్టు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు డిగ్రి పూర్తి చేసిన వారే ఎక్కువగా ఉండడంతో దీని నిలిపివేసినట్లు సమాచారం.