Site icon NTV Telugu

Two And Four-Wheelers In India: దేశంలో టూవీలర్లు, ఫోర్ వీలర్ల సంఖ్య ఎంతో తెలుసా..?

Two Wheeler

Two Wheeler

Two-Wheelers And Four-Wheelers In India: దేశంలో టూవీలర్లు, ఫోర్ వీలర్ల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. ముక్యంగా ద్విచక్ర వాహనాలు దాదాపుగా ఒక్కో కుటుంబానికి ఒకటి ఉంటోంది. ఇదిలా ఉంటే దేశంలో మొత్తం రిజిస్టర్ అయిన టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాల వివరాలను వెల్లడించారు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. పార్లమెంట్ సభ్యులు అడిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ వాహనాల వివరాలను వెల్లడించారు. దేశంలో ఆగస్టు 3, 2022 నాటికి మొత్తం 21 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు.. 7 కోట్లకు పైగా ఫోర్ వీలర్లు రిజస్ట్రేషన్ అయ్యాయని గురువారం పార్లమెంట్ కు వెల్లడించారు.

Read Also: GO First Flight: గో ఫస్ట్ ఫ్లైట్ కు తప్పిన ముప్పు.. అత్యవసరంగా ల్యాండింగ్

ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం మొత్తం వాహనాల్లో 5,44,643 ఎలక్ట్రిక్ టూ వీలర్లు ఉండగా.. 54,252 ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్లు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. సీఎన్జీ, ఇథనాలు, ఫ్యూయల్ సెల్ హైడ్రోజన్, ఎల్ఎన్జీ, ఎల్పీజీ, సోలార్, మిథనాల్ మొదలైన ఇంధన రకాలతో నడిచే వాహనాల్లో 2,95,245 ద్విచక్ర వాహనాలు, 18,47,539 ఫోర్ వీలర్లు, ఇతర వాహనాలు ఉన్నట్లు ఆయన పార్లమెంట్ కు తెలిపారు. మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రాథమిక బాధ్యత వహిస్తుందని చెప్పారు. ట్రాఫిక్ కు అనుగుణంగా జాతీయ రహదారులు నిర్వహించబడతాయని వెల్లడించారు. వానాకాలంలో వరదలు, కొండచరియలు విరిగి పడటం వల్ల రోడ్లు చాలా చోట్ల దెబ్బతింటున్నాయని.. వాటిని వెంటనే పునరుద్ధరించి ట్రాఫిక్ సాధారణ స్థితికి తీసుకువస్తున్నామని ఆయన తెలిపారు. జాతీయ రహదారుల అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని ఆయన అన్నారు. ట్రాఫిక్ డిమాండ్ ఆధారంగా ఎక్స్ ప్రెస్ వేల నిర్మాణం, జాతీయ రహదారుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తున్నామని ఆయన అన్నారు.

Exit mobile version