Site icon NTV Telugu

JK Encounter: కుల్గాంలో ఎదురుకాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి

Jk Encounter

Jk Encounter

పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత సైన్యం ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే పలువురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. పహల్గామ్ ఉగ్రవాదులు సహా పలువురు హతమయ్యారు. ఈ క్రమంలో జరుగుతున్న ఏరివేత కార్యక్రమంలో శనివారం కుల్గాంలో ఎదురుకాల్పులు చోటుచసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఉగ్రవాదులకు-భద్రతా దళాల మధ్య కాల్పులు చోటుచేసుకోగా.. ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

ఇది కూడా చదవండి: Netanyahu: గాజా స్వాధీనంపై నెతన్యాహు కీలక ట్వీట్.. ఈసారి ఏమన్నారంటే..!

జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందినట్లు సైన్యం శనివారం తెలిపింది. విధి నిర్వహణలో ధైర్యవంతులైన ప్రిత్పాల్ సింగ్, హర్మిందర్ సింగ్‌ల అత్యున్నత త్యాగాన్ని గౌరవిస్తుందని తెలిపింది. వారి ధైర్యం, అంకితభావం మనకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఇండియన్ ఆర్మీ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. మృతుల కుటుంబాలకు సంఘీభావంగా ప్రకటించింది. ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Prostitution Racket: భారత్ చూపిస్తామంటూ బంగ్లాదేశీ మైనర్ అమ్మాయిని వ్యభిచారంలోకి నెట్టిన స్నేహితురాలు!

దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని అఖల్ దగ్గర ఉన్న అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా దళాలు ఆగస్టు 1న కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది.

Exit mobile version