Site icon NTV Telugu

Delhi: ఇన్‌స్టాగ్రామ్ లైక్స్, కామెంట్స్ గొడవ.. ఇద్దరి దారుణహత్య

Delhi Incident

Delhi Incident

Two killed In Delhi Over Instagram Likes, Comments issue: ప్రస్తుతం యువత సోషల్ మీడియాకు బానిసగా మారింది. చేతిలో మొబైల్ ఫోన్ లేకపోతే క్షణకాలం కూడా ఉండలేకపోతున్నారు. అంతలా సెల్ ఫోన్లకు అడిక్ట్ అయిపోయారు. దీనికి తోడు యువత రీల్స్, ఫోటోలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు తమ సోషల్ మీడియా ఖాతాల్లో అప్లోడ్ చేస్తున్నారు. కొన్నిసార్లు తమ పోస్టులకు కామెంట్స్, లైక్స్ రాకపోయినా తట్టుకోలేకపోతున్నారు. అంతలా సున్నిత మనస్కులుగా మారిపోతున్నారు. చివరకు లైక్స్, కామెంట్స్ కోసం గొడవలు పెట్టుకుంటున్న సందర్భాలను కూడా చూస్తున్నాం.

ఇండియాలో మొబైల్ డేటా చౌకగా మారడంతో ఇంటర్నెట్ ను చాలా మంది వాడుకుంటున్నారు. ప్రజలు ఇంటర్నెట్ పై గడిపే సమయం గతంతో పోలిస్తే బాగా పెరిగింది. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వాడకం బాగా పెరిగింది. అయితే ఇది మంచికి వాడితే తప్పులేదు. అయితే కొన్ని సార్లు ఇది పెడదోవలకు దారితీస్తోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైక్స్, కామెంట్స్ గొడవ ఇద్దరు యువకుల హత్యలకు దారితీసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్‌లు మరియు వ్యాఖ్యలపై జరిగిన వాదన బుధవారం ఢిల్లీలో జంట హత్యకు దారితీసింది. సోషల్ మీడియాలో మహిళలో వివాదం కారణంగా ఢిల్లీలోని భల్స్వా డెయిరీలో ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచి హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. ఇదే ప్రాంతంలోని ముకుంద్ పూర్ పార్ట్ 2లో తనను కలవాలని ఇద్దరు యువకులను మహిళ కోరింది. అయితే వారు అక్కడికి చేరుకోగానే దాడి జరిగిందని పోలీసులు తెలిపారు.

పలుమార్లు కత్తిపోట్లకు గురైన ఇద్దరు బాధితులు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించారు స్థానికులు.. అయితే కత్తులతో దాడి చేసిన దుండగులు తప్పుంచుకోవడానికి అక్కడ ఉన్న స్థానికునలు కూడా బెదిరించారని.. బాధితులను ఆస్పత్రికి తీసుకొని వెళ్లి చికిత్స అందిస్తున్న సమయంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version