Site icon NTV Telugu

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మావో అగ్ర నేతలు హతం

Chhattisgarh

Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌‌లో మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. కొండగావ్-నారాయణ్‌పూర్ సరిహద్దులో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్ట్ అగ్ర నేతలను భద్రతా దళాలు హతమార్చాయి. సంఘటనాస్థలి నుంచి ఏకే 47 తుపాకులతో పాటు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వారి గురించి వివరాలు ఇంకా వెల్లడించలేదు. అయితే ప్రస్తుతం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని బస్తర్ ఐజీ పి.సుందరరాజ్ తెలిపారు. మరిన్ని వివరాలు అందాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఇది కూడా చదవండి: Earthquake: ఆప్ఘనిస్థాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ ప్రకంపనలు

ఇదిలా ఉంటే మంగళవారం తెల్లవారుజామున అంబాగఢ్ చౌకీ జిల్లాలో 5 లక్షల రివార్డు ఉన్న ఒక నక్సలైట్ భద్రతా దళాల ముందు లొంగిపోయాడు. 34 ఏళ్ల రూపేష్ మాండవి అలియాస్ సుఖ్‌దేవ్ జిల్లాలోని సీనియర్ పోలీసు అధికారుల ముందు లొంగిపోయాడని పోలీసు అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Vijayashanti : పవన్ సతీమణి మీద వస్తున్న ట్రోల్స్ పై స్పందించిన విజయశాంతి..

Exit mobile version