Chhattisgarh: సీఆర్పీఎఫ్ జవాన్లు లక్ష్యంగా తరుచుగా దాడులకు పాల్పడుతున్నారు నక్సలైట్లు. ఐఈడీలను పేలుస్తూ ఎప్పటికప్పుడు సీఆర్పీఎఫ్ జవాన్లు దెబ్బతీసేలా నీచమైన చర్యలకు పాలపడుతున్నారు. ఇలా జవాన్లు పైన దొంగదాడికి ప్రయత్నించడం నక్సలైట్లకు కొత్తేమీ కాదు. గతం లోనూ సీఆర్పీఎఫ్ జవాన్లు లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. తాజాగా అలాంటి ఘటనే మరోసారి వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోయిన 54 మంది నక్సలైట్ల జ్ఞాపకార్థం నేటి నుంచి డిసెంబర్ 8 వరకు పీఎల్‌జీఏ వారోత్సవాలు జరుపుకోనున్నట్లు నక్సలైట్లు కరపత్రాలను విడుధుల చేసారు. అలానే కొన్ని చోట్ల పోస్టర్లను అంటించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన జవాన్లు శనివారం ఉదయం పీఎల్‌జీఏ వారోత్సవాలకు సంబంధిచిన పోస్టర్లను సైనికులు ఆ ప్రాంతం తొలగిస్తున్నారు.
Read also:SpaceX: స్పేస్ ఎక్స్ రాకెట్ సేఫ్ ల్యాండ్.. ఎలాన్ మస్క్ విషెస్
ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ లోని దంతేవాడలో నక్సలైట్లు నీచాతినీచమైన పనికి ఒడిగట్టారు. సీఆర్పీఎఫ్ జవాన్లు టార్గెట్ గా ఉదయం ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో సీఆర్పీఎఫ్ 195 బెటాలియన్‌కు చెందిన ఇద్దరు జవాన్లకు, అలానే ఒక మీడియా వ్యక్తికి గాయాలయ్యాయి. కాగా గాయపడిన సీఆర్పీఎఫ్ జవాన్లను చికిత్స నిమిత్తం సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన జవాన్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా కొన్ని రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో పెట్రోలింగ్‌లో ఉన్న సీఆర్‌పీఎఫ్, డీఆర్‌జీ బృందాలపై నక్సలైట్లు వరుసగా ఐఈడీలను పేల్చారు. ఈ కేమంలో బైక్ పైన వెళ్తున్న ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు తృటిలో తప్పించుకున్నారు. కాగా భద్రతా బలగాలను దెబ్బతీసేందుకు నక్సలైట్లు ఈ పేలుడుకు పాల్పడ్డారు.