Site icon NTV Telugu

Cyber Terror Activities: ప్రభుత్వ వెబ్‌సైట్‌పై సైబర్ దాడి.. భారత వ్యతిరేక సందేశాన్ని పోస్ట్ చేసిన ఇద్దరు అరెస్టు

Ats

Ats

Cyber Terror Activities: ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతీయ వెబ్‌సైట్‌లను లక్ష్యంగా చేసుకునే హ్యాకర్ల దాడి చేస్తారనే హెచ్చరికలు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కు వచ్చింది. దీంతో భారత వ్యతిరేక సందేశాలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసినందుకు గుజరాత్ ఏటీఎస్ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసింది. ఇక, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని ఖేడా జిల్లాలోని నదియాద్ కు చెందిన ఒక మైనర్ బాలుడితో పాటు జసీమ్ షానవాజ్ అన్సారీ గుర్తించారు. వీరు ఇద్దరూ టెలిగ్రామ్ ఛానెల్ నడుపుతున్నారు.. అక్కడి నుంచి వారు తమ హ్యాకింగ్ కార్యకలాపాలకు సంబంధించిన విషయాలను పంచుకున్నారని తెలిపారు.

Read Also: Bengaluru Big Alert: బెంగళూరులో కుండపోత వర్షం కురిసే ఛాన్స్.. ఐఎండీ స్ట్రాంగ్ వార్నింగ్

ఈ సందర్భంగా యాంటీ టెర్రరిజం స్క్వాడ్ DIG సునీల్ జోషి మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతీయ వెబ్‌సైట్‌ల హ్యాకింగ్ గురించి ఇన్‌స్పెక్టర్ డీబీ ప్రజాపతికి నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని అన్నారు. నిందితుల కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం.. విచారణలో జాసిమ్ అన్సారీతో పాటు మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు.. వారి మొబైల్ ఫోన్‌లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి పంపించామని చెప్పుకొచ్చారు. వీరి ఇద్దరు ఎన్‌క్రిప్టెడ్ చాట్‌లను ఎలా హ్యాక్ చేయాలో అనేది తెలుసని దర్యాప్తులో తేలింది అన్నారు.

Read Also: CM Chandrababu: గంగమ్మ జాతరకు సీఎం చంద్రబాబు..

అయితే, ఈ ఇద్దరు భారత ప్రభుత్వ వెబ్‌సైట్‌లను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడికి ప్రయత్నించారని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ DIG సునీల్ జోషి తెలిపారు. EXPLOITXSEC ఛానెల్ కోసం ELITEXPLOIT అనే బ్యాకప్ టెలిగ్రామ్ ఛానెల్‌ను సృష్టించారని, @BYTEXPOIT అనే IDని ఉపయోగించి దానిని Anonsec అని పేరు మార్చారని పేర్కొన్నారు. గత తొమ్మిది నెలలుగా 50కి పైగ సార్లు భారత ప్రభుత్వ వెబ్‌సైట్‌లపై దాడి చేశారని చెప్పుకొచ్చారు. ఈ దాడులకు సంబంధించిన ఆధారాలను వారి టెలిగ్రామ్ గ్రూప్‌లో షేర్ చేశారని అన్నారు.. ఇక, ఈ ఇద్దరిపై ఐటీ చట్టం సెక్షన్లు 43, 66(f) కింద కేసు నమోదు చేయబడింది. నిందితులకు ఎవరు సహాయం చేశారు, వారికి ఏదైనా ఆర్థిక సహాయం అందిందా లేదా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. వీరి ఇరువురి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నామని ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి వెల్లడించారు.

Exit mobile version