Twitter ‘Official’ Tick Starts Appearing on Verified Accounts in India: ట్విట్టర్ ని హస్తగతం చేసుకున్న తర్వాత కొత్త బాస్ ఎలాన్ మస్క్ పూర్తిగా ప్రక్షాళన చర్యలు చేపడుతున్నారు. అక్టోబర్ చివరి వారంలో 44 బిలియన్ డాలర్ల భారీ డీల్ తో ట్విట్టర్ టేకోవర్ చేసిన తర్వాత సీఈవో పరాగ్ అగర్వాల్ తో పాటు పాలసీ చీఫ్ విజయగద్దెలతో పాటు పలువురు కీలక ఉద్యోగులను తొలగించారు. దీంతో పాటు 50 శాతం మంది ఉద్యోగులు అంటే 3700 మందిని తొలగిస్తూ గత శుక్రవారం నుంచి ప్రక్రియ ప్రారంభించారు. భారత్ లోని 200 మంది ఉద్యోగులను తొలగించాడు మస్క్. దీంతో పాటు బ్లూటిక్ ఉంటే వెరిఫైడ్ ఖాతాలకు నెలకు 8 డాలర్ల(సుమారు రూ. 650)ను వసూలు చేస్తున్నట్లు ఇప్పటికే మస్క్ స్పష్టం చేశారు.
Read Also: IT Industry: ఐటీలో కోటి కష్టాలు.. రానున్నది గడ్డుకాలమేనా..?
ఇదిలా ఉంటే తాజాగా బుధవారం నుంచి భారత్ లోని పలువురు వెరిఫైడ్ ట్విట్టర్ ఖాతాల బ్యాడ్జింగ్ మారింది. కొత్తగా ‘‘ అఫిషియల్’’ పదంతో కూడిన బ్లూటిక్ బ్యాడ్జింగ్ ప్రారంభం అయింది. నరేంద్రమోదీ ట్విట్టర్ ఖాతాతో పాటు దేశంలోని ప్రముఖుల ట్విట్టర్ ఖాతాల్లో ట్విట్టర్ బ్యాడ్జింగ్ మారింది. హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మరికొందరు మంత్రుల ట్విట్టర్ హ్యాండిల్స్‌లో కూడా ఇదే లేబుల్ కనిపించింది.
ఇప్పుడు వెరిఫైడ్ ఖాతాలు ఉన్నవారు ట్విట్టర్ బ్లూకు సబ్‌స్క్రైబ్ పొందాలని కంపెనీ సూచిస్తోంది.నవంబర్ నెలాఖరు వరకు ఇండియాలో కూడా వెరిఫైడ్ ఖాతాల నుంచి నెలకు రూ. 650 వరకు వసూలు చేయాలని ట్విట్టర్ భావిస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని మస్క్ స్పష్టం చేశారు. ఇటీవల ఓ ఇండియన్ నెటిజన్ భారతదేశంలో ట్విట్టర్ బ్లూ సేవలు ఎప్పుడు ప్రారంభం అవుతాయని ప్రశ్నించగా.. నెలలోపు అంటూ మస్క్ సమాధానం ఇచ్చారు. అయితే కొనుగోలు శక్తి ఆధారంగా నెల ధరను నిర్ణయిస్తామని మస్క్ స్పష్టం చేశారు. ట్విట్టర్ బ్లూ సభ్యత్వం ఉన్నవారికి మరిన్ని అదనపు ప్రయోజనాలు ఉంటాయిని ట్విట్టర్ తెలుపుతోంది.
