NTV Telugu Site icon

Twitter: నా ఉద్యోగం పోయింది.. భారతీయుడి ట్వీట్ వైరల్

Yash Agarwal

Yash Agarwal

Twitter employee Yash Agarwal’s tweet went viral: ట్విట్టర్ ని సొంతం చేసుకున్న తర్వాత ఎలాన్ మస్క్ భారీగా చర్యలు తీసుకుంటున్నారు. వచ్చీ రావడంతోనే నలుగురు కీలక ఉద్యోగులను తొలగించారు. ప్రస్తుతం ట్విట్టర్ లోని సగం మంది ఉద్యోగులను సాగనంపుతున్నాడు. ఇదిలా ఉంటే భారతీదేశంలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించింది ట్విట్టర్. అయితే ఇప్పుడు ఉద్యోగం కోల్పోయిన భారతీయుడి ట్వీట్ తెగ వైరల్ అవుతుంది. సాధారణంగా ఏదైనా కంపెనీలో ఉద్యోగం కల్పోతేనే బాధపడే మనం.. ఒక ప్రతిష్టాత్మక కంపెనీ నుంచి ఉద్యోగం కోల్పోతే ఎలా ఉంటుంది. కానీ 25 ఏళ్ల ఇండియన్ యశ్ అగర్వాల్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. తాను ఉద్యోగం కోల్పోయిన విషయాన్ని ఎంతో సంతోషంతో నెటిజెన్లతో పంచుకున్నారు. నా ఉద్యోగం ఊడింది.. అంటూ యశ్ అగర్వాల్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

Read Also: Elephant Attack Brothers: అన్నదమ్మునలు తొక్కి చంపిన ఏనుగు.. రక్షించే ప్రయత్నంలో తల్లిదండ్రులపై

తాను ఉద్యోగాన్ని కోల్పోయిన విషయాన్ని సన్నిహితులు, ఇతర ఉద్యోగులతో పంచుకున్నారు యశ్ అగర్వాల్. ఉద్యోగం కోల్పోయినందుకు బాధగా లేదని.. తాను ట్విట్టర్ కంపెనీలో పనిచేసిన సమయాన్ని ఎంతో విలువైందిగా భావించాడు. ట్విట్టర్ లోగో ఉన్న రెండు కుషన్లు పట్టుకుని సంతోషంగా ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ‘‘ బర్డ్ యాప్.. ట్విట్టర్ తొలగించింది.. ట్విట్టర్ లో పనిచేయడం గొప్ప గౌరవంగా.. ట్విట్టర్ సంస్కృతిలో భాగం అవ్వడం గొప్ప హక్కుగా భావిస్తున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు. అయితే ఆయన చేసిన ట్వీట్ పై నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. మీరు అద్భుతమైన వ్యక్తివి.. ట్విట్టర్ మిమ్మల్ని పొందడం అదృష్టం అని.. ఉద్యోగరీత్యా మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేనున్నానని గుర్తుంచుకోండి..అంటూ ఆయన కొలీగ్ ట్వీట్ చేశారు. మీలాంటి ఉద్యోగిని కొల్పోవడం ట్విట్టర్ కే నష్టమని.. ఇంతకుమించిన అవకాశాలు మీకోసం ఎదురుచూస్తున్నాయంటూ మరో నెటిజెన్ కామెంట్  చేశారు.

ఇదిలా ఉంటే ట్విట్టర్ సొంత చేసుకున్న తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లని రద్దు చేసి తానే ఏకైక డైరెక్టర్ గా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ లో 7500 మంది పనిచేస్తుంటే ప్రస్తుతం వీరిలో 50 శాతం మందికి ఉద్వాసన పలకనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియను ట్విట్టర్ శుక్రవారం ప్రారంభించింది. ఉద్యోగులు ఎవ్వరూ ఆఫీసులకు రావద్దంటూ..ఒక వేళ బయలుదేరిని ఇంటికి తిరిగి వెళ్లిపోవాంటూ ఉద్యోగులకు మెయిల్స్ వెళ్లాయి. 3800 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే దీనిపై శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ కోర్టులో పిటిషన్ దాఖలు అయింది.