Elephant Attack Brothers: ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లా కిర్మిరా బ్లాక్ పరిధిలోని భౌంరా గ్రామ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు సోదరులను వారి తల్లిదండ్రుల ముందే తొక్కి చంపింది ఏనుగు. పిల్లలను రక్షించే ప్రయత్నంలో దంపతులకు తీవ్రగాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఝర్సుగూడ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు స్థానికులు.
Read also: Gold Rates: మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు
నివేదికల ప్రకారం, ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాకు చెందిన ఉమేష్ రామ్ సత్నామీ మరియు అతని భార్య లెహెరాబాయి సత్నామి వారి ఇద్దరు కుమారులు ధనంజయ్ (9), అభయ్ (11)లతో కలిసి స్థానికంగా ఉన్న ఇటుక బట్టీలో పని చేయడానికి గ్రామానికి వచ్చారు. పని ప్రదేశం సమీపంలో కుటుంబం నిద్రిస్తుండగా, ఇద్దరు సోదరులపై ఏనుగు దాడి చేసింది. కన్న బిడ్డలను కాపాడేందుకు దంపతులు ప్రయత్నించినా ఫలించలేకుండాపోయింది. ఏనుగు దాడి ఘటనలో అన్నదమ్ములిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన తర్వాత ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ ప్రాంతంలో ఏడు ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించడం గమనార్హం. అటవీశాఖ అధికారులు జంతువులను రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు.
Astrology: నవంబర్ 05, శనివారం దినఫలాలు