NTV Telugu Site icon

PFI: పీఎఫ్‌ఐ ట్విటర్ ఖాతా నిలిపివేత.. నిషేధం విధించిన మరుసటి రోజే..

Pfi

Pfi

PFI: నిషేధిత గ్రూప్ పాపులర్ ఫ్రంట్‌ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)ను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన మరుసటి రోజే సామాజిక మాధ్యమాల్లో ఆ సంస్థకు సంబంధించిన ఖాతాలు నిలిపివేయబడ్డాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఎఫ్ఐ అధికారిక ఖాతాలను ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు తొలగించాయి. ఇప్పుడు దీనికి సంబంధించి ఫేస్‌బుక్‌ పేజీ, ఇన్‌స్టా ప్రొఫైల్‌ కూడా ఇప్పుడు అందుబాటులో లేవు. ట్విటర్‌లో పీఎఫ్‌ఐ సంస్థ ఖాతాకు దాదాపు దాదాపు 81,000 మంది అనుచరులు ఉన్నారు.

దేశంలో మతసామరస్యాన్ని దెబ్బతీయడంతో పాటు యువతను ఐసిస్, లష్కరే తొయిబా, ఆల్‌ఖైదా వంటి ఉగ్రసంస్థల్లో చేరేలా ప్రోత్సహిస్తోందని పీఎఫ్‌ఐ సంస్థపై కేంద్రం ఐదేళ్ల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. చట్ట విరుద్ధమైన సంస్థగా ప్రకటిస్తూ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్‌లో పేర్కొంది. పీఎఫ్ఐతో పాటు దాని అనుబంధ సంఘాల కార్యకలాపాలపై 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో పీఎఫ్‌ఐ ప్రచారానికి డిజిటల్ మాధ్యమం ద్వారా పాల్పడుతుందనే ఆలోచనల దృష్ట్యా.. దానికి సంబంధించిన అన్ని వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా ఖాతాలను కేంద్రం నిలిపివేసింది.

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో ఉద్విగ్న సన్నివేశం.. ఉబ్బితబ్బిబ్బైన చిన్నారి

పీఎఫ్‌ఐకి సంబంధించిన పలువురు నాయకుల ఖాతాలను కూడా ట్విటర్ నిలిపివేసింది. 50,000 కంటే తక్కువ ఫాలోవర్లను కలిగి ఉన్న దాని ఛైర్మన్ ఓఎంఏ సలామ్, 85 వేల ఫాలోవర్లను కలిగి ఉన్న ప్రధాన కార్యదర్శి అనిస్‌ అహ్మద్‌కు చెందిన ఖాతాలను కూడా ట్విటర్ నిలిపివేసింది. పీఎఫ్‌ఐ నిషేదానికి ముందు అరెస్టయిన నాయకుల్లో వారిద్దరు కూడా ఉన్నారు.