టీవీకే అధినేత, నటుడు విజయ్ ఢిల్లీలో సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యారు. తమ ఎదుట హాజరుకావాలని ఇటీవల సీబీఐ సమన్లు జారీ చేసింది. దీంతో సోమవారం ఉదయం చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీకి చేరుకున్న ఆయన సీబీఐ ముందు హాజరయ్యారు.
గతేడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ నిర్వహించిన ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 44 మంది మృతి చెందారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని రాజకీయంగా కుదిపేసింది. పెద్ద ఎత్తున నాయకులు విమర్శలు గుప్పించారు. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఘటన జరిగిన ప్రాంతాన్ని దర్యాప్తు సంస్థ అధికారులు పరిశీలించి పలు వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలో విజయ్‌కు సీబీఐ సమన్లు ఇచ్చింది.
