Turmoil in the IT industry.. Crisis with layoffs: ఐటీ ఇండస్ట్రీ ప్రస్తుతం తీవ్ర కష్టాలు ఎదుర్కొంటోంది. నష్టాలను తగ్గించుకునేందుకు ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, నెట్ ఫ్లిక్స్ పాటు పలు కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించేస్తోంది. తాగా ఫేస్ బుక్, వాట్సాప్ మాతృసంస్థ మెటా కూడా 11,000 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. ఈ నిర్ణయం ఐటీ రంగ పరిస్థితులను తెలియజేస్తోంది. అంతర్జాతీయ, దేశీయ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను వదిలించుకునే ఆలోచనల్లో ఉన్నాయి. ఆర్థికమాంద్యం భయాలు, వస్తున్న నష్టాలు ఐటీ పరిశ్రమలు ఉద్యోగులు తొలగించుకోవడంతో పాటు ఉద్యోగుల జీతాలను తగ్గిస్తున్నాయి.
Read Also: T20 World Cup: పాపం కేన్ మామ.. నాకౌట్ మ్యాచ్‌లలో న్యూజిలాండ్ ఇంతేనా?
కొత్త రిక్రూట్మెంట్లు లేవు.. ఆఫర్ లెటర్లు ఇచ్చానా జాబ్ గ్యారెంటీ లేదు. దేశంలో ప్రముఖ ఐటీ కంపెనీలు కొన్ని నెలల క్రితం ఫ్రెషర్లను చేర్చుకుని ఆఫర్ లెటర్లు కూడా ఇచ్చింది. అయితే ఉద్యోగంలో జాయినింగ్ తేదీలను మాత్రం నెలనెలకు మారుస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే కొత్త రిక్రూట్మెంట్లను చేసుకునే ఆలోచనలో ఐటీ కంపెనీలకు లేనట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ టెక్ కంపెనీలు ఉద్యోగాల కోతలపై దృష్టిపెట్టాయి. టాప్ కంపెనీల లే ఆఫ్ లకు యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల పెంపు, స్టాక్ మార్కెట్ల నష్టాలు, మాంద్యం భయాలు కారణంగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ప్రపంచం మాంద్యం భయంలో ఉందని తెలిసి ఐటీ రంగంలో కుదుపు మొదలైంది. ఇప్పటికే ట్విట్టర్ ను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్ 50 శాతం మంది ఉద్యోగులనున అంటే దాదాపుగా 3700 మందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. రానున్న కాలంలో దేశీయ ఐటీ కంపెనీలు కూడా ఇదే దారిలో వెళ్తాయా.? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇండియాలో ఐటీ ఉద్యోగం అంటే యువతకు ఓ మోజు. అయితే ఇప్పుడు ఐటీ పరిశ్రమల్లో ఒడిదొడుకులు దేశ యువతను, ఐటీ ఉద్యోగులను భయపెడుతున్నాయి. 2022 అక్టోబర్ చివరి నాటికి 45,000 మందిని తొలగించాయి అమెరికాలోని టెక్ కంపెనీలు.
Read Also: Mahindra: మహీంద్రా తన ఈవీల ఛార్జింగ్ కోసం మూడు కంపెనీలతో ఒప్పందం
ఫేస్ బుక్, వాట్సాప్, ఇస్టా గ్రామ్ ల మాతృసంస్థ అయిన మెటా తాజాగా 11 వేల ఉద్యోగులను తొలగించడం చూస్తే..రానున్న కాలంలో గడ్డుకాలమే అని తెలుస్తోంది. 2004లో ఫేస్ బుక్ ప్రారంభం అయినప్పటి నుంచి చూడని విధంగా నష్టాలు ఎదురు అవ్వడంతోనే మెటా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చైనాతో పాటు అమెరికా, బ్రిటన్, పలు యూరోపియన్ దేశాలు ఆర్థిక సంక్షోభానికి ముందు ఉన్నాయి.అమెరికా, బ్రిటన్ లో ఎప్పుడూ లేనంతగా ద్రవ్యోల్భనం పెరుగింది. రానున్న ఆరు నెలలు, సంవత్సరంలో లోగా మాంద్యం ముంచుకొస్తుందని తెలుస్తోంది. అయితే మూడేళ్ల పాటు మాంద్యం ఉండవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం ఐటీ కంపెనీలు నష్టాలు తగ్గించుకునేందుకే ఉద్యోగాలను తొలగించడంతో పాటు కొత్త రిక్రూట్మెంట్లను ఆపేసినట్లు తెలుస్తోంది.
Read Also: Meta: ఉద్యోగులకు మెటా షాక్.. 11,000 మంది తొలగింపు
వచ్చే ఏడాది కాలంలో ఆర్థిక మాంద్యం తప్పదని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. గత రెండేళ్లతో పోలిస్తే వచ్చే ఏడాది మరింత కష్టకాలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కోవిడ్ సమయంలో కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఐటీ ఇండస్ట్రీ దూసుకుపోయింది. అయితే పరిస్థితి ఇప్పుడు మాత్రం మారింది. ఐటీ ఉద్యోగం, ఆఫర్ లెటర్లు వచ్చిన తర్వాత ఆనందంగా ఉన్న ఐటీ ఆశావహుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. అయితే ఇప్పుడు ఇచ్చిన ఆఫర్ లెటర్లను వెనక్కి తీసుకుంటున్నాయి కంపెనీలు. డెలాయిట్, ఇన్ఫోసిస్, విప్రో, క్యాప్ జెమిని, ఆక్సెంచర్, మైండ్ ట్రీ, ఎంఫసిస్ లాంటి అనేక కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఆన్ బోర్డింగ్ కంపెనీలను వారాలు, నెలుల ఆలస్యం చేస్తున్నాయి. చాలా మంది ఫ్రెషర్లు తమ జాయినింగ్ ఎప్పుడో చెప్పాలని కంపెనీలను అడుగుతున్నాయి. దీంతో తమ కెరీర్ ఏమిటో తెలియని పరిస్థితి ఏర్పడింది.