Bangladesh: భారత్‌కు పక్కలో బళ్లెంలా బంగ్లాదేశ్, మరో దేశం నుంచి ఆయుధాల సేకరణ..
- భారత్ పక్కలో బళ్లెంలా తయారవుతున్న బంగ్లాదేశ్..
- పాకిస్తాన్ నుంచే కాకుండా టర్కీ నుంచి ఆయుధాల సేకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: భారత్‌కు పాకిస్తాన్ మాత్రమే కాకుండా, బంగ్లాదేశ్ కూడా పక్కలో బళ్లెంతా తయారవుతోంది. షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయివచ్చిన తర్వాత, అక్కడ భారత వ్యతిరేకత బాగా పెరిగింది. తాత్కిలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ సర్కార్ స్పష్టంగా భారత వ్యతిరేక విధానాలను అవలంభిస్తోంది. పలు సందర్భాల్లో భారత్‌ని ఇరుకున పెట్టేలా యూనస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పాకిస్తాన్ , చైనాలతో దోస్తీ మన దేశానికి ఇబ్బందికరంగా మారింది.
ఇప్పటికే, బంగ్లాదేశ్-పాకిస్తాన్ మధ్య సైనిక సహకారం పెరిగిండి. ఆ దేశం నుంచి పలు ఆయుధాలను కొనుగోలు చేయాలని భావించింది. ఇప్పుడు పాకిస్తాన్ మిత్రదేశమైన టర్కీ నుంచి కూడా బంగ్లాదేశ్ ఆయుధాలను కొనేందుకు సిద్ధమైంది. టర్కీ బంగ్లాదేశ్‌లోని రక్షణ పరిశ్రమకు సహకరిస్తుందని టర్కీ ఉన్నత స్థాయి రక్షణ అధికారి మంగళవారం తెలిపారు.
Also Read
బంగ్లాదేశ్ సైన్యం తన ఫేస్బుక్ పోస్టులో.. ‘‘తుర్కియే రక్షణ పరిశ్రమల కార్యదర్శి హెచ్. ఇ. ప్రొఫెసర్ హాలుక్ గోర్గున్ ఈరోజు ఆర్మీ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రెండు దేశాల మధ్య ఉన్న రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడం గురించి వారు చర్చించారు. ’’ అని పేర్కొంది. టర్కిష్ సైనిక అధికారులు బంగ్లాదేశ్ రక్షణ పరిశ్రమకు పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చినట్లు బంగ్లా సైన్యం పేర్కొంది. టర్కీ సాయంతో ఆధునిక ఆయుధాలను తయారు చేస్తామని చెప్పారు.
ఇప్పటికే, బంగ్లాదేశ్ టర్కీ నుంచి బైరెక్టర్ డ్రోన్లను కొనుగోలు చేసింది. వీటిని భారత సరిహద్దుల్లో డిప్లాయ్ చేసింది. ఇప్పుడు మరిన్ని డ్రోన్లు, ఆయుధాలను కొనుగోలు చేయాలని ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఇటీవల, బంగ్లాదేశ్ ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ అథారిటీ (BIDA) చైర్మన్ ఆషిక్ చౌదరి ఇటీవల తుర్కియే పర్యటన సందర్భంగా ఒక సైనిక కర్మాగారాన్ని సందర్శించారు. దీనికి ముందు, ఏప్రిల్‌లో బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు తౌహిద్ హుస్సేన్‌ను టర్కీ అంతరిక్ష పరిశ్రమ చీఫ్ కలిశారు.
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!