Site icon NTV Telugu

Bangladesh: భారత్‌కు పక్కలో బళ్లెంలా బంగ్లాదేశ్, మరో దేశం నుంచి ఆయుధాల సేకరణ..

Bangladesh

Bangladesh

Bangladesh: భారత్‌కు పాకిస్తాన్ మాత్రమే కాకుండా, బంగ్లాదేశ్ కూడా పక్కలో బళ్లెంతా తయారవుతోంది. షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయివచ్చిన తర్వాత, అక్కడ భారత వ్యతిరేకత బాగా పెరిగింది. తాత్కిలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ సర్కార్ స్పష్టంగా భారత వ్యతిరేక విధానాలను అవలంభిస్తోంది. పలు సందర్భాల్లో భారత్‌ని ఇరుకున పెట్టేలా యూనస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పాకిస్తాన్ , చైనాలతో దోస్తీ మన దేశానికి ఇబ్బందికరంగా మారింది.

ఇప్పటికే, బంగ్లాదేశ్-పాకిస్తాన్ మధ్య సైనిక సహకారం పెరిగిండి. ఆ దేశం నుంచి పలు ఆయుధాలను కొనుగోలు చేయాలని భావించింది. ఇప్పుడు పాకిస్తాన్ మిత్రదేశమైన టర్కీ నుంచి కూడా బంగ్లాదేశ్ ఆయుధాలను కొనేందుకు సిద్ధమైంది. టర్కీ బంగ్లాదేశ్‌లోని రక్షణ పరిశ్రమకు సహకరిస్తుందని టర్కీ ఉన్నత స్థాయి రక్షణ అధికారి మంగళవారం తెలిపారు.

Read Also: Flipkart Goat Sale 2025: ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ లో క్రేజీ డీల్స్.. ఫోన్స్, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్స్..

బంగ్లాదేశ్ సైన్యం తన ఫేస్‌బుక్ పోస్టులో.. ‘‘తుర్కియే రక్షణ పరిశ్రమల కార్యదర్శి హెచ్. ఇ. ప్రొఫెసర్ హాలుక్ గోర్గున్ ఈరోజు ఆర్మీ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రెండు దేశాల మధ్య ఉన్న రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడం గురించి వారు చర్చించారు. ’’ అని పేర్కొంది. టర్కిష్ సైనిక అధికారులు బంగ్లాదేశ్ రక్షణ పరిశ్రమకు పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చినట్లు బంగ్లా సైన్యం పేర్కొంది. టర్కీ సాయంతో ఆధునిక ఆయుధాలను తయారు చేస్తామని చెప్పారు.

ఇప్పటికే, బంగ్లాదేశ్ టర్కీ నుంచి బైరెక్టర్ డ్రోన్‌లను కొనుగోలు చేసింది. వీటిని భారత సరిహద్దుల్లో డిప్లాయ్ చేసింది. ఇప్పుడు మరిన్ని డ్రోన్లు, ఆయుధాలను కొనుగోలు చేయాలని ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఇటీవల, బంగ్లాదేశ్ ఇన్వెస్ట్‌మెంట్ డెవలప్‌మెంట్ అథారిటీ (BIDA) చైర్మన్ ఆషిక్ చౌదరి ఇటీవల తుర్కియే పర్యటన సందర్భంగా ఒక సైనిక కర్మాగారాన్ని సందర్శించారు. దీనికి ముందు, ఏప్రిల్‌లో బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు తౌహిద్ హుస్సేన్‌ను టర్కీ అంతరిక్ష పరిశ్రమ చీఫ్ కలిశారు.

Exit mobile version