Site icon NTV Telugu

TTD Temple: ముంబైలో టీటీడీ ఆలయానికి ఈనెల 21న భూమిపూజ.. సీఎం షిండేను ఆహ్వానించిన టీటీడీ ఛైర్మన్

Mumbai Ttd Temple

Mumbai Ttd Temple

TTD Temple in Mumbai: దేశవ్యాప్తంగా టీటీడీ ఆలయాలు విస్తరిస్తున్నాయి. ఇందులో భాగంగా త్వరలో మహారాష్ట్ర రాజధాని ముంబైలోనూ తిరుమల తిరుపతి దేవవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం జరగనుంది. ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే నిధులు, భూమి కేటాయింపులు పూర్తయ్యాయి. ఇప్పుడు భూమి పూజకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. ఈనెల 21న భారీ ఎత్తున ముంబైలో టీటీడీ ఆలయానికి భూమి పూజ చేపట్టాలని అధికారులు తలపెట్టారు. ఈ మేరకు పలు పార్టీలకు టీటీడీ ఆహ్వానాలను పంపుతోంది. వెంకటేశ్వరస్వామి ఆల‌య భూమి పూజ కార్యక్రమానికి కీల‌క నేత‌ల‌ను టీటీడీ ఆహ్వానిస్తోంది.

Read Also: TikTok: ఇండియాలోకి మళ్లీ టిక్ టాక్.. ఈ వార్త నిజమేనా?

ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి ముంబైలో పర్యటిస్తున్నారు. తొలుత సీఎం ఏక్‌నాథ్‌ షిండేకు టీటీడీ ఆలయ భూమిపూజ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం అధికారిక కూటమిలో భాగమైన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీటీడీ వేద పండితులు షిండే, ఫడ్నవీస్‌లకు ఆశీర్వచనాలు అందించారు. ఆ తర్వాత శివ‌సేన చీఫ్ ఉద్ధవ్ థాక‌రే నివాసానికి వెళ్లిన టీటీడీ అధికారుల బృందం మాజీ మంత్రి ఆదిత్య థాక్రేకు ఆహ్వాన ప‌త్రిక అంద‌జేసింది. కాగా ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ప్రభుత్వం గతంలో ప్రభుత్వం తరపున నవీ ముంబై సమీపంలోని ఉల్వేలో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం కోసం 10 ఎకరాల భూమిని టీటీడీకి కేటాయించింది. ఈ ఆలయ నిర్మాణానికి రూ. 60 కోట్ల నుంచి రూ. 70 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Exit mobile version