NTV Telugu Site icon

Donald Trump: ‘‘ టుడే ఈజ్ ద బిగ్ వన్’’.. సుంకాలపై ట్రంప్ సంచలన ప్రకటన..

Trump2

Trump2

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సుంకాలతో ప్రపంచ దేశాలును బెదిరిస్తున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాల సుంకాలను విధించారు. తాజాగా, ఆయన సుంకాలపై సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. గురువారం ట్రంప్ ‘పరస్పర సుంకాల’ను ఆవిష్కరించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. తన తాజా సుంకాల ప్రణాళిక గురించి ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. ప్రపంచంలో అమెరికా దిగుమతులపై సుంకాలను వసూలు చేసే ప్రతీ దేశాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చని తెలుస్తోంది.

Read Also: Nirmala Sitharaman: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై రాజ్యసభలో నిర్మల సీతారామన్ సంచలన వ్యాఖ్యలు..

‘‘ టు డే ఈజ్ ద బిగ్ వన్: రెసిబ్రోకల్ టారిఫ్స్’’ అంటూ పరస్పర సుంకాలపై తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ప్రకటించారు. ట్రంప్ టారిఫ్ ప్లాన్ ఎప్పుడు విడుదలవుతుందో వెంటనే స్పష్టంగా తెలియలేదు. ట్రంప్, గురువారం ఉదయం నుంచి అమలు అవుతుందని సూచించారు. భారత ప్రధాని నరేంద్రమోడీ వైట్‌ హౌజ్ సందర్శనకు వెళ్లే సమయంలో ట్రంప్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. తాజాగా ట్రంప్ ప్రకటనతో అమెరికా, ప్రపంచదేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత విస్తరిస్తుందనే భయాలు పెరిగాయి.