Site icon NTV Telugu

Core-5: భారత్‌తో కలిసి ‘‘సూపర్ గ్రూప్’’ యోచనలో ట్రంప్.. కోర్-5 కూటమిపై చర్చ.?

Trump

Trump

Core-5: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త కూటమి ఏర్పాటుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ శక్తులతో కలిసి ‘‘కోర్-5’’ లేదా ‘‘C5’’ పేరుతో కొత్త గ్రూప్ ఏర్పాట్లుపై ఆలోచిస్తున్నట్లు పలు వార్తలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా, భారత్, రష్యా, చైనా, జపాన్ దేశాలతో కూటమి కట్టాలని ట్రంప్ అనుకుంటున్నారు. ప్రస్తుతం, యూరప్ ఆధిపత్యం ఎక్కువగా ఉన్న G7 దేశాలను కాదని కొత్త కూటమిని ఏర్పాటుపై చర్చలు ఊపందుకున్నాయి. ఇప్పటి వరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, వైట్ హౌజ్ గత వారం ప్రచురించిన భద్రతా వ్యూహానికి సంబంధించిన వెర్షన్‌లో ఈ కొత్త కూటమికి సంబంధించిన ఆలోచన ఉన్నట్లు అమెరికన్ పబ్లికేషన్ పొలిటికో నివేదించింది.

Read Also: Akhanda 2: ఆలస్యమైనా తగ్గని ‘అఖండ 2’ హవా: నార్త్ రెస్పాన్స్ సూపర్ క్రేజీ?

కొత్త కూటమి, G7 కూటమి నిబంధనలైన ప్రభాస్వామ్యబద్ధ పాలనకు విరుద్ధంగా ఉంటుంది. ‘‘అమెరికా, చైనా, భారత్, రష్యా, జపాన్‌లతో కోర్-5 కూటమి వ్యూహాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఇది G7 లాగే ప్రతీ ఏడాది శిఖరాగ్ర సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తుంది. ఈ గ్రూప్ ఎజెండాలో మిడిల్ ఈస్ట్ భద్రత, ఇజ్రాయిల్-సౌదీల మధ్య సంబంధాలు ప్రాధాన్యతగా ఉంటుంది’’ అని నివేదిక వెల్లడించింది. అయితే, రష్యాను బలపరిచి యూరప్ కన్నా శక్తివంతం చేయాలని, పాశ్చాత్య ఐక్యత, నాటోలను బలహీన పరచాలని ట్రంప్ భావిస్తున్నట్లు యూఎస్ మిత్రదేశాలు భావిస్తున్నాయి.

Exit mobile version