Site icon NTV Telugu

Infiltrators: అక్రమ బంగ్లాదేశీలపై త్రిపుర ఉక్కుపాదం, టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు..

Bsf

Bsf

Infiltrators: అక్రమంగా తమ రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తున్న బంగ్లాదేశీయులపై పలు ఈశాన్య రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా, అస్సాం, త్రిపురతో పాటు చాలా ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశీ చొరబాటుదారులతో విసిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాలు వీరిని బహిష్కరించేందుకు చర్యల్ని ప్రారంభించాయి. ఇప్పటికే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, అక్రమ బంగ్లాదేశీయులను గుర్తించి, వారు ఆక్రమించిన స్థలాలను విముక్తి చేస్తున్నారు.

Read Also: Pakistan: పాకిస్తాన్ నిజస్వరూపం ఇది.. పహల్గామ్ దాడి ఉగ్రసంస్థకు మద్దతు..

ఇదిలా ఉంటే, తాజాగా త్రిపుర రాష్ట్రం కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారుల్ని గుర్తించి, వారిని బహిష్కరించేందుకు పశ్చిమ త్రిపుర జిల్లా ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్‌తో త్రిపుర 856 కి.మీ సరిహద్దును పంచుకుంటోంది. సరిహద్దు జిల్లాల్లో ఈ చొరబాట్లు ఎక్కువగా ఉన్నాయి. పశ్చిమ తి్రిపు జిల్లాలోని మొత్తం 15 పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ అధికారులు ఈ టాస్క్‌ఫోర్స్‌లో ఉంటారు. ఈ టాస్క్ ఫోర్స్‌కు జిల్లా ఇంటెలిజెన్స్ డీఎస్పీ దేబాసిష్ సాభా నేతృత్వం వహిస్తారు.

“త్రిపురలోకి ప్రవేశించే వారి సంఖ్య తగ్గినప్పటికీ చొరబాటుదారులను గుర్తించడానికి SIT ఏర్పాటు చేయబడింది” అని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా అన్నారు. రాష్ట్రంలో బిజెపి కీలక మిత్రపక్షమైన తిప్రా మోతా పార్టీ (TMP), అక్రమ వలసదారుల గుర్తింపు, నిర్బంధం, బహిష్కరణకు సంబంధించి హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. చొరబాట్లు రాష్ట్ర స్థానిక ప్రజలు, ముఖ్యంగా గిరిజనుల ఆచారాలు, సామాజిక-ఆర్థిక అభివృద్ధిపై ప్రభాం చూపిస్తుందని టీఎంఫీ పార్టీ ప్రద్యోత్ దేబ్బర్మ గతంలో అన్నారు.

Exit mobile version