NTV Telugu Site icon

Tripura: సీఎంగా మానిక్ సాహా ప్రమాణ స్వీకారం

Manik Saha 1

Manik Saha 1

త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రిగా మానిక్ సాహా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన త్రిపురకు 11 ముఖ్యమంత్రి. శనివారం అనూహ్యంగా సీఎంగా ఉన్న బిప్లవ్ కుమార్ దేబ్ రాజీనామా చేయడంతో… బీజేపీ శాసన సభ పక్షంగా కొత్త సీఎంగా మానిక్ సాహాను ఎన్నుకున్నారు. ఆదివారం రాజధాని అగర్తలతో గవర్నర్ సత్యదేవ్ నరేన్ ఆర్య, మానిక్ సాహాతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్యసభ సభ్యుడైన సాహాను అనూహ్యంగా సీఎం పదవి వరించింది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు సాహా. 2016లో కాంగ్రెస్ ను వదిలి సాహా బీజేపీలో చేరారు. అప్పటి నుంచి రాష్ట్రంలో కీలకంగా మారారు.

గత రెండు రోజుల క్రితం మాజీ సీఎం బిప్లవ్ కుమార్ దేబ్ ఢిల్లీ వచ్చి అమిత్ షాను కలిశారు ఆ తరువాతి రోజు శనివారం బిప్లవ్ కుమార్ దేబ్ సీఎంగా రాజీనామా చేశారు. 25 ఏళ్ల వామపక్ష పాలను దించి బీజేపీ తొలిసారిగా త్రిపురలో అధికారాన్ని చేజిక్కించుకుంది. తరువాత బిప్లవ్ ను సీఎంగా చేసింది. అయితే 2023లో జరిగే ఎన్నికలకు ఏడాది ముందే బిప్లవ్ ను పదవి నుంచి తప్పించి మానిక్ సాహాకు పగ్గాలు అప్పగించారు.

అయితే ఇటీవల కాలంలో త్రిపుర రాష్ట్రంలో త్రుణమూల్ కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకుంటోంది. కాంగ్రెస్ తో పాటు చిన్నా చితక పార్టీల నుంచి నేతలు త్రుణమూల్ లో చేరుతున్నారు. దీనికి తోడు త్రిపుర బీజేపీలో అసమ్మతి పోరును కరెక్ట్ గా  హ్యండీల్ చేయలేదని బిప్లవ్ పై అధిష్టానం వేటు వేసినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అమలు చేసిన వ్యూహాన్నే త్రిపురలో కూడా బీజేపీ అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఉత్తరాఖండ్ లో ముందున్న సీఎంను తప్పించి పుష్కర్ సింగ్ ధామికి పగ్గాలు అప్పగించారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని కూడా కైవసం చేసుకుంది. ఇదే ఫార్ములాను ఉపయోగించి ప్రజల్లో వ్యతిరేఖత లేకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

.

Show comments