NTV Telugu Site icon

Tripura: బీజేపీని సవాల్ చేసిన త్రిపా మోథా.. ఆ ఒక్కటి తప్పా అన్నింటికి సిద్ధమన్న కాషాయపార్టీ..

Tripura

Tripura

Tripura Election Results: ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లే త్రిపులో బీజేపీ భారీ విజయం సాధించింది. కమ్యూనిస్టుల కంచుకోటను కూల్చిన బీజేపీ వరసగా రెండో సారి ఆ రాష్ట్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయింది. ఈ రోజు వెల్లడించిన అసెంబ్లీ ఫలితాల్లో మ్యాజిక్ ఫిగర్ ను దాటి మెజారిటీ స్థానాలు సాధించింది. త్రిపులో మొత్తం 60 స్థానాలు ఉంటే ఇప్పటికే బీజేపీ 34 చోట్ల విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 26 చోట్ల విజయం సాధించగా.. మరో 8 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఇదిలా ఉంటే ఈ సారి త్రిపురలో బీజేపీని సవాల్ చేస్తూ నిలబడింది ‘‘త్రిపా మోథా’’. మాణిక్య రాజవంశానికి చెందిన ప్రద్యోత్ బిక్రమ్ వర్మ నేతృత్వంలో ఏర్పడిన ఈ పార్టీ బీజేపీని నిలువరించింది. త్రిపురలో ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ త్రిపా మోథా పార్టీ ఏర్పడింది.

Read Also: BJP: జాతీయ పార్టీల నిధుల్లో సగానికి పైగా బీజేపీకే.. వెల్లడించిన ఎన్నికల సంఘం..

ప్రస్తుత ఎన్నికల్లో త్రిపామోథా 13 స్థానాల్లో విజయం సాధించింది. 2018 ఎన్నికల్లో బీజేపీ, ఐపీఎఫ్టీ పార్టీతో కలిసి మొత్తం 60 స్థానాలకు గానూ 44 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఈ సారి మాత్రం త్రిపా మోథా కారణంగా సీట్లు పడిపోయాయి. కేవలం 33-34 సీట్లకు మాత్రమే బీజేపీ కూటమి పరిమితం అవుతోంది. 2018 ఎన్నికల్లో బీజేపీ కూటమితో సంబంధం లేకుండా 36 సీట్లను గెలుచుకుంటే ఈసారి ఏకంగా 11 స్థానాలను కోల్పోయింది.

2021 త్రిపుర ఆదివాసీ ప్రాంతాల స్వయం ప్రతిపత్తి మండలి ఎన్నికల్లో త్రిపామోథా 30కి గానూ 18 సీట్లను గెలుచుకుంది. ఆ పార్టీ చీఫ్ ప్రద్యోత్ ప్రత్యేక రాష్ట్రం తిప్రల్యాండ్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్రిపామోథా, బీజేపీకి సపోర్ట్ ఇస్తే ఒక్క ప్రత్యేక రాష్ట్రం మినహా అన్ని డిమాండ్లను నెరవేరస్తామని బీజేపీ ప్రకటించింది. బీజేపీ అధికార ప్రతినిధి సుబ్రతా చక్రవర్తి ఈ విషయాన్ని వెల్లడించారు.

Show comments