సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు.. కోర్టు ధిక్కారానికి భయపడొద్దు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ ప్రభుత్వం అయినా.. కోర్టుల నుంచి మొట్టకాయలు పడకుండా.. న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా పనిచేసేందుకు ప్రయత్నాలు చేస్తాయి.. ఏదైనా కొత్త పథకం తెచ్చే సమయంలో.. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే సమయంలో.. దానికి ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది..? అనే దానిపై కూడా సమాలోచనలు చేసి ముందుకు వెళ్తుంటారు.. అయితే, కొన్నిసార్లు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తూనే ఉంటుంది.. అయితే, త్రిపుర సీఎం బిప్లబ్ దేవ్ మాత్రం.. అవి ఏమీ పట్టించుకోవద్దు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోర్టు ధిక్కారానికి భయపడకుండా పనిచేయాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి… ఇవాళ త్రిపుర సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ 26వ వార్షికోత్సవ సమయంలో.. అధికారులతో సీఎం బిప్లబ్ దేవ్ మాట్లాడుతూ.. మన వ్యవస్థలో ఒక నిర్దిష్ట పనిని చేయలేకపోతున్నామని అధికారులు చెప్పారు.. ఏం చేసినా కోర్టు ధిక్కరణ అవుతుందేమో అని చాలా మంది అధికారులు భయపడుతున్నారు.. కానీ, అలా ఎందుకు భయపడాలి..? కోర్టు ధిక్కారానికి రాష్ట్రంలో ఎవరైనా జైలుకు వెళ్లారా..? నేను ఇక్కడే ఉన్నాను… మీరు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితే వస్తే మీకంటే ముందు నేను వెళ్తా.. మిమ్మల్ని జైల్లో పెట్టడం అంత సులభం కాదు అంటూ చెప్పుకొచ్చారు.. అంతే కాదు.. ఒకవేళ జైలుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. తీసుకెళ్లేది పోలీసులే.. వారు నా నియంత్రణలో ఉండి పనిచేస్తారు అంటూ ఆయన చేసేన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిపోయాయి.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!