భారత దేశంలోనే అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ డీల్ దక్షిణ ముంబైలోని మలబార్ హిల్ లో జరిగింది. సముద్రానికి ఎదురుగా ఉండే విలాసవంతమైన ట్రిప్లెక్స్ అపార్ట్మెంట్ ను లోధా గ్రూప్ నుంచి రూ. 396 కోట్లతో ఫెమీ కేర్ వ్యవస్థాపకుడు జేపీ తపారియా కొన్నారు. ఈ సూపర్ లగ్జరీ రెసిడెన్షియల్ టవర్ లోధా మలబార్ హిల్ యొక్క విలాసవంతమై 26,27,28 అంతస్తులలో ఉంది. 27 160చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బంగలా విస్తరించి ఉంది. ఇందులో ఒక్కో చదరపు అడుగుకు రూ. 1.36 లక్షల రేటు చొప్పున ఈ డీల్ జరిగింది. దీంతో ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన నివాస లావాదేవీలలో ఒకటిగా నిలిచింది.
Also Read : IPL 2023 : క్రికెట్ అభిమానులకు డబుల్ మజా
ఇక గతంలో.. ఈ ఏడాదిలోనే ఫిబ్రవరిలో డిమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ కుటుంబ సభ్యులు ముంబైలోనే రూ. 1,238 కోట్ల విలువైన 28 హౌసింగ్ యూనిట్లను కొనుగొలు చేశారు. ఇది బహుశా భారతదేశంలో అతిపెద్ద ఆస్తి ఒప్పందం. అదే నెలలో, రియల్ ఎస్టేట్ డెవలపర్ గోద్రెజ్ ప్రాపర్జీస్ లిమిటెడ్ ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ను అభివృద్ది చేయడానికి చెంబూర్ లోని రాజ్ కపూర్ బంగ్లాను కొనుగోలు చేసింది. గత వారం రియాల్టీ మేుజర్ డీఎల్ఎఫ్ లిమిటెడ్ కూడా గురుగ్రామ్ లోని తన హౌసింగ్ ప్రాజెక్ట్ లో రూ. 7 కోట్లు మరియు అంతకంటే ఎక్కువ ధర ఉన్న 1,137 లగ్జరీ అపార్ట్మెంట్ లను 3 రోజుల్లో రూ. 8000 కోట్లకు విక్రయించినట్లు ప్రకటించింది.
Also Read : TSRTC: ఆర్టీసీ ప్రయాణికులపై భారం.. బస్సుల్లో పెరిగిన టికెట్ ధరలు
దేశంలోనే అతిపెద్ద, అత్యంత ఖరీదైన ప్రాపర్టీ మార్కెట్ ముంబై మార్చి నెలలో రికార్డ్ స్టాపం డ్యూటీ సేకరణతో కొత్త శిఖరానికి చేరుకుంది. దీని కారణంగా లగ్జరీ ప్రాపర్టీల అమ్మకం గణనీయంగా పెరిగింది. ఎందుకంటే రెసిడెన్షియల్ ప్రాపర్టీలో పెట్టుబడిపై మూలధన లాభాల నుంచి మినహాయింపు ఏప్రిల్ నుంచి రూ. 10 కోట్లకు పరిమితం చేయనుంది. 2023-2024 యూనియన్ బడ్జెట్ లో.. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి హౌసింగ్ ప్రాపర్టీలో పెట్టబుడిపై మూలధన లాభాల నుంచి తగ్గింపుపై పరిమితిని ప్రకటించింది. స్టాంప్ డ్యూటీ ఛార్జీలు, రెడీ రికనర్ రేట్లలో ఏదైనా పెంపుదలకు ముందే ఇతర సెగ్మెంట్ లలోని గృహ కొనుగోలుదారులు తమ డీల్ లను ముగించాలనే హడావిడి కూడా 2022-23లో రిజిస్ట్రేషన్ ను గరిష్టం స్థాయికి నెట్టివేసింది.
Also Read : Hinduism to Islam: మత మార్పిడి చేసినట్లు ఆరోపణలు.. ఏడుగురిపై కేసు నమోదు
మహారాష్ట్ర బడ్జెట్ ఆదాయం మార్చిలో అత్యుత్తమ పనితీరును నమోదు చేసింది. దేశ వాణిజ్య రాజధానిలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరిలో 13,002 డీల్స్ తో 34శాతం పెరిగాయి. స్టాప్ం డ్యూటీ వసూళ్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం 8శాతం పెరిగి. 1,203 కోట్లకు చేరుకుంది. డీల్ ల పరిమాణం పెరిగింది. పన్ను సంబంధిత కారకాలు స్టాంప్ డ్యూటీ ఆదాయంలో పెరుగుదలకి దారితీశాయి. విభాగాల్లో డిమాండ్ బాగానే ఉన్నప్పటికీ, సరసమైన, మధ్య ఆదాయ గృహాలకు అధిక వడ్డీ రేట్లు హానికరం అని రుజువు చేస్తున్నాయి.