Site icon NTV Telugu

PM Modi: ట్రిపుల్ తలాక్, మహిళా బిల్లు, ఆర్టికల్ 370.. 17వ లోక్‌సభ గొప్ప సంస్కరణలు..

Pm Modi

Pm Modi

PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ..బీజేపీ ప్రభుత్వ విజయాలను గురించి ప్రస్తావించారు. 17వ లోక్‌సభలో కొన్ని తరాలుగా ఎదురుచూసిన విజయాలను సాధించామని ప్రధాని అన్నారు. 17వ లోక్‌సభ చివరి సెషన్ చివరి రోజు ఆయన సభను ఉద్దేశించి మాట్లాడారు. ఐదేళ్లలో దేశంలో గేమ్ ఛేంజింగ్ సంస్కరణల్ని తెచ్చామని అన్నారు. అనేక తరాలుగా ఏదురుచూస్తున్న ఆర్టికల్ 370ని ఈ లోక్‌సభలో రద్దు చేశామని, జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అణిచివేసినట్లు ప్రధాని తెలిపారు. రాబోయే 25 ఏళ్లు మన దేశానికి చాలా ముఖ్యమైనవని పీఎం మోడీ పేర్కొన్నారు.

Read Also: PM Modi: అబుదాబిలో మోడీ టూర్.. హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్న ప్రధాని

ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, ప్రతిష్టాత్మక జీ20 సమావేశాల నిర్వహణ మొదలైన అనేక సమస్యలను ఉటంకిస్తూ.. దేశం మార్పు దిశగా పయణిస్తోందని ప్రధాని వెల్లడించారు. డేటా ప్రొటెక్షన్ బిల్లు, ఉగ్రవాదంతో పోరాడేందుకు కఠిన చట్టాలు, వాడుకలోని అనేక చట్టాల తొలగింపు, మహిళా రిజర్వేషన్ బిల్లులను ప్రభుత్వం సాధించిన విజయాలుగా ఆయన పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్లతో సహా అట్టడుగున ఉన్న వ్యక్తలపై దృష్టిసారించమని తెలిపారు. ట్రాన్స్‌జెండర్లకు తమ ప్రభుత్వం పద్మ అవార్డులను ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కోవిడ్ మహమ్మారిని ప్రస్తావిస్తూ, గత ఐదేళ్లలో ‘శతాబ్ధపు అతిపెద్ద సంక్షోభం’ని చూశామని అన్నారు.

Exit mobile version