Site icon NTV Telugu

PM Modi: నకిలీ జాబ్ కార్డులతో కేంద్రం నిధులను దోచాలనుకున్నారు.. మమత సర్కార్‌పై ప్రధాని ఆరోపణ

Pm Modi

Pm Modi

PM Modi: పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ, తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. టీఎంసీ వంశపారంపర్య రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష కూటమిలోని టీఎంసీ, కాంగ్రెస్ వంటి పార్టీలు తమ కుటుంబాల అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచిస్తు్న్నాయని విమర్శించారు. శనివారం సిలిగురిలో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని మోడీ, మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల ద్వారా టీఎంసీని గద్దె దించే మార్గం తెరవబడుతోందని అన్నారు.

Read Also: Uttar Pradesh: కులాంతర వివాహం చేసుకుందని సోదరి భర్త దారుణహత్య..

‘‘మనదేశంలో తల్లులు కనీస సౌకర్యాల కోసం కష్టపడటం నేను చూశాను. అందుకు వారి జీవితాలను సులభతరం చేయడానికి పారిశుద్ధ్యం, ఉచిత విద్యుత్, బ్యాంక్ ఖాతాలు, కుళాయి నీటిని తీసుకురావడానికి నేను ఒత్తిడి చేశాను. అయితే ఇక్కడ అధికారంలో ఉన్న లెఫ్ట్ ప్రంట్, టీఎంసీ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజల కనీస అవసరాలను విస్మరించింది’’ అని అన్నారు. టీఎంసీ రాష్ట్రాన్ని దోచుకుంటోందని, ఎంజీఎన్ఆర్ఈజీసీ కింద కేంద్ర నిధులనను దోచుకునేందుకు నకిలీ జాబ్ కార్డులు సృష్టించిందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు వంశపారంపర్య రాజకీయాలకు పాల్పడుతోందని, టీఎంసీ తన మేనల్లుడి గురించి మాత్రమే బాధపడుతోందని, అయితే కాంగ్రెస్ రాజకుటుంబం గురించి మాత్రమే బాధపడుతోందని అన్నారు.

Exit mobile version