Site icon NTV Telugu

Trinamool Congress: ‘‘బాబ్రీ మసీదుని నిర్మిస్తాం’’.. తృణమూల్ నేత వ్యాఖ్యలతో వివాదం..

Trinamool Congress

Trinamool Congress

Trinamool Congress: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. ముర్షిదాబాద్ జిల్లాలోని బెల్డంగాలో ‘‘బాబ్రీ మసీదు’’ని పునర్నిర్మించాలని భావిస్తున్నట్లు టీఎంసీ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వివాదానికి తెరలేపారు. ఈ వ్యాఖ్యలపై బెంగాల్‌లో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ నుంచి తీవ్ర స్పందన వచ్చింది.

Read Also: Indian Coast Guard: 2 బంగ్లాదేశ్ నౌకల్ని సీజ్ చేసిన ఇండియన్ కోస్ట్ గార్డ్..

‘‘నేను కొన్ని రోజుల క్రితం జల్సా-మెహఫిల్‌లో పాల్గొన్నాను. ఇది బెల్దంగాలోని ఒక మదర్సాలో ఉంది.’’ అని కబీర్ చెప్పారు. ‘‘ నేను అక్కడ సమావేశానికి వెళ్లి వారి భావాలకు ప్రాధాన్యతినిస్తూ, మసీదు నిర్మాణాన్ని ప్రతిపాదించాను. బెల్దాంగాలో బాబ్రీ మసీదు ఏర్పాటు చేయాలి. వచ్చే ఏడాది డిసెంబర్ 6న, మేము బాబ్రీ మసీదుని అందరి విరాళాలతో పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌‌లోని బెల్దంగాలో కొత్త బాబ్రీ మసీదును నిర్మిస్తాం’’ అని టీఎంసీ నేత చెప్పారు.

గతంలో కూడా టీఎంసీ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో టీఎంసీ అతడిని బహిష్కరించింది. తిరిగి పార్టీలో చేరి ముర్షిదాబాద్ లోని భరత్‌పూర్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఈ ఏడాది ప్రారంభంలో.. విద్వేషపూరిత ప్రసంగం చేసి వార్తల్లో నిలిచాడు. బీజేపీ కార్యకర్తల్ని భాగీరథి నదిలో పడేస్తానని హెచ్చరించాడు. కబీర్ చేసిన వ్యాఖ్యలపై నటుడు-రాజకీయ నాయకుడు మిథున్ చక్రవర్తి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version