NTV Telugu Site icon

Puja Khedkar: పూణె కలెక్టర్ వేధిస్తున్నారు.. పోలీసులకు పూజా ఖేద్కర్ ఫిర్యాదు

Iaspujakhedkar

Iaspujakhedkar

ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం మరో కొత్త మలుపు తిరిగింది. తాజాగా ఆమె పోలీసులకు.. పూణె కలెక్టర్‌పై ఫిర్యాదు చేసింది. పూణె కలెక్టర్ సుహాస్‌ దివాసే తనను వేధిస్తున్నాడని పూజా కంప్లంట్ చేసింది.

ఇది కూడా చదవండి: Budget 2024: హల్వా వేడుకలో పాల్గొన్న ఆర్థికమంత్రి నిర్మలమ్మ

పూజా ఖేద్కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పూణె కలెక్టర్ సుహాస్ దివాసే.. రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆమెను పూణె నుంచి వాషిమ్‌కు బదిలీ చేశారు. అనంతరం ఆమెపై వరుసగా ఆరోపణలు వెలువెత్తాయి. చదువు దగ్గర నుంచి మెడికల్ సర్టిఫికెట్ల వరకు అన్ని నకిలీ అని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం.. ఆమె శిక్షణ కార్యక్రమాన్ని నిలిపివేసింది. ఐఏఎస్‌ ప్రొబేషన్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అధికార దుర్వినియోగం, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారన్న ఆరోపణలతో సర్కార్ ఈ యాక్షన్ తీసుకుంది. తాజాగా ఆమె పూణె కలెక్టర్‌పై ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం ఇంకా ఏ దిశగా సాగుతుందో చూడాలి.

ఇది కూడా చదవండి: Amaravati: రాజధానిని నేషనల్ హైవేతో అనుసంధానించేలా సీఆర్డీయే ప్రణాళికలు