Maoist Leader Chalapati: “భార్యతో సెల్ఫీ”.. మూల్యం చెల్లించుకున్న మావోయిస్ట్ నేత చలపతి..
- భార్యతో సెల్ఫీ మావోయిస్టు నేత చలపతి ప్రాణాలు తీసింది..
- సెల్ఫీ సాయంతో భద్రతా బలగాల గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoist Leader Chalapati: మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్న చలపతి ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మందికిపైగా మావోయిస్టులు హతమయ్యారు. చలపతి చనిపోవడం భద్రతా బలగాలకు పెద్ద విజయంగా చెప్పొచ్చు. ఇతడిని రూ. 1 కోటి రివార్డు ప్రకటించిందంటే, ప్రభుత్వం ఇతడికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. చిత్తూర్ జిల్లా మదనపల్లెకు చెందిన చలపతి అసలు పేరు జయరాం రెడ్డి.
భద్రతా దళాలపై జరిగిన అనేక దాడులకు చలపతి సూత్రధారిగా ఉన్నారు. ఇతడికి 8-10 మంది సెక్యూరిటీ ఉంటుంది. ఫిబ్రవరి 2008లో ఒడిశాలోని నయాగఢ్ జిల్లాలో 13 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన దాడికి ఇతను సూత్రధారిగా ఉన్నాడు. మావోయిస్టు అగ్రనేత ఆర్కేకి సన్నిహితుడు, ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న మావోయిస్ హిడ్మాకు చలపతి గురువుగా పరిగణించబడుతాడు. సల్వాజుడుం సృష్టికర్త మహేంద్ర కర్మని దాడి చేసి చంపిన కేసులో కూడా ఇతడి ప్రమేయం ఉంది.
Also Read
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
- Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
- Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
Read Also: Danam Nagender: చింతల్బస్తీలో ఎమ్మెల్యే దానం హల్చల్.. కూల్చివేత అడ్డగింత
కొంపముంచిన భార్యతో సెల్ఫీ:
చలపతి తన భార్య అరుణ అలియాస్ చైతన్య వెంకట్ రవితో సెల్ఫీ తీసుకోవడమే అతడి ప్రాణాలను తీసినట్లు తెలిసింది. ఆంధ్ర ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ (AOBSZC) ‘డిప్యూటీ కమాండర్’ అయిన అతని భార్య అరుణతో తీసుకున్న సెల్ఫీ భద్రతా దళాలకు అతన్ని గుర్తించడంలో సహాయపడింది. మే 2016లో ఏపీలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత స్వాధీనం చేసుకున్న ఒక స్మార్ట్‌ఫోన్‌లో ఈ సెల్ఫీ కనుగొనబడింది.
తాజావార్తలు
-
Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
-
The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
-
Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
-
CM Vijay: “పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం”.. రాష్ట్రంలో కొత్త పథకం..
-
TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..