NTV Telugu Site icon

Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ తల్లికి ఊరట.. ముందస్తు బెయిల్‌ను సమర్థించిన సుప్రీంకోర్టు

Prajwal Revanna

Prajwal Revanna

సుప్రీంకోర్టులో కర్ణాటక ప్రభుత్వానికి చుక్కెదురైంది. కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ తల్లికి కర్ణాటక హైకోర్టు ముందస్తు బెయిల్‌ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో సిద్ధరామయ్య సర్కార్‌కు సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలినట్లైంది. కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని కేఆర్ నగర్‌లోని ఓ ఇంటి పనిమనిషిని కిడ్నాప్ చేసిన కేసులో భవానీ రేవణ్ణ విచారణకు హాజరుకాకపోవడంతో కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరింది. అయితే భవానీ రేవణ్ణ కర్ణాటక హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు అప్లై చేసుకోవడంతో న్యాయస్థానం మంజూరు చేసింది.

అయితే హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే శుక్రవారం సుప్రీంకోర్టు విచారించి ముందస్తు బెయిల్‌ను రద్దు చేసేందుకు నిరాకరించింది. కర్ణాటక హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.

ఇది కూడా చదవండి: Team India: టీమిండియాకు మరో షాక్.. కీలక బౌలర్‌కు గాయం..!

ఇక విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ.. కొడుకు కోసం మహిళలను కొనుగోలు చేయడంలో తల్లి ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆరోపించారు. తన కుమారుడిపై లైంగిక వేధింపుల కేసులను విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) సహకరించడం లేదని ఆరోపించడం అన్యాయమని, దర్యాప్తు సందర్భంగా ఆమె ఇప్పటికే 85 ప్రశ్నలకు సమాధానమిచ్చారని తెలియజేస్తూ జూన్ 18న కర్ణాటక హైకోర్టుకు భవానీ తరుపున న్యాయవాది తెలియజేయడంతో ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు అయింది. ఇక ఆమె తప్పుదోవ పట్టించే సమాధానాలు చెప్పిందన్న సిట్ వాదనను కోర్టు తోసిపుచ్చింది.

ఇది కూడా చదవండి: TG Government : 9 యూనివర్సిటీలకు వీసీలను నియమించిన తెలంగాణ సర్కార్‌