Site icon NTV Telugu

PM Modi: రేపు మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలి భేటీ

Modicabinet

Modicabinet

ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తర్వాత తొలిసారి ఈ మంత్రివర్గం సమావేశం అవుతోంది. కేబినెట్ మంత్రులతో పాటు సహాయమంత్రులు, స్వతంత్ర మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ధర పరుగులు.. నేడు మరింత పైపైకి

మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి త్వరలోనే తొలి ఏడాది పూర్తికానుంది. ఈ తరుణంలో ప్రధాని అధ్యక్షతన కేంద్రమంత్రి మండలి సమావేశం కానుండడం ప్రాధాన్యత సంతరించుకోనుంది. సుష్మా స్వరాజ్ భవన్‌లో జరగనున్న కేబినెట్ సమావేశంలో ఆపరేషన్ సిందూర్‌కు దారితీసిన పరిస్థితులు, తదనంతర పర్యవసానాలను సహచర మంత్రులకు ప్రధాని మోడీ వివరించే అవకాశం ఉంది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇది కూడా చదవండి: Spider Web: స్పైడర్ వెబ్‌పై రష్యా వ్యూహాత్మక మౌనం.. ఏం జరగబోతుంది?

అలాగే జనాభా లెక్కలతో పాటు కుల గణన కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. గత వారం సమావేశమైన ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కుల గణనపై చర్చించారు. తాజాగా జరగబోయే కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Exit mobile version