NTV Telugu Site icon

Tomato Price: టమాటాకు రికార్డ్ ధర.. కిలోకి రూ. 250

Tomato

Tomato

Tomato Price: దేశవ్యాప్తంగా టమాటా ధర కన్నీరు పెట్టిస్తోంది. ఇప్పటికే టమాటా ధర సెంచరీ దాటేసింది. ఇప్పుడు ఏకంగా కిలో టమాటా ధర డబుల్ సెంచరీని దాటేసింది. వేడి పరిస్థితులు, వర్షాభావం వల్ల టమాటా పంట దెబ్బతినడంతో పలు రాష్ట్రాల్లో టమాటా ధరలు రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి. తాజాగా టామాటా ధర రూ. 250కి చేరువైంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గంగోత్రి ధామ్ లో టమాటా ధర రూ. 250కి చేరువైంది. ఉత్తర కాశీ జిల్లాలో రూ. 180-200 వరకు ఉంది.

Read Also: Madhya Pradesh: దళిత యువకులపై తప్పుడు ఆరోపణలు.. మలం తినిపించి దాడి చేసిన మైనారిటీ కుటుంబం

టమాటా ధరలు పెరగడంతో సామాన్యుడు వీటిని కొనేందుకు భయపడుతున్నారు. టమాటా పండించే రాష్ట్రాలు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో వేడిగాలులు, భారీ వర్షాలు టమాటా పంటను తీవ్రంగా దెబ్బతీశాయి. డిమాండ్ సప్లైకి అంతరాయం కలగడంతో వీటి రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. చెన్నైలో కిలో టమాటా ధరలు రూ. 100-130 పలుకుతోంది. బెంగళూర్ లో కిలోకి రూ.101-121 వరకు ఉంది. మార్చి, ఏప్రిల్‌లో అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల టమాటాకు తెగుళ్లు సోకడంతో మార్కెట్‌లో అధిక దిగుబడులు రావడంతో ధరలు పెరిగాయి.

ఇదిలా ఉంటే టమాటాల ధరలు పెరగడంతో కొన్ని ప్రాంతాల్లో చోరీలు జరుగుతున్నాయి. కర్ణాటకలో హసన్ జిల్లాలో ఓ టమాటా తోట నుంచి ఏకంగా రూ.2.5 లక్షల పంటను దొంగలు ఎత్తుకెళ్లారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.