Site icon NTV Telugu

Tomato Prices: భగ్గుమంటున్న టమాటా.. నెల రోజుల్లో 43% పెరిగిన ధరలు..

Tomato Prices

Tomato Prices

Tomato Prices: టమాటా ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. నిన్నమొన్నటి వరకు సామాన్యుడికి అందుబాటులో ఉన్న టామాటా, ఇప్పుడు భగ్గుమంటోంది. భారతదేశం అంతటా టమాటా ధరలు విపరీతంగా పెరిగాయి. దీని వలన వినియోగదారులతో పాటు రిటైలర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కన్స్యూమర్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, నవంబర్ 26 నాటికి, టమోటాల సగటు రిటైల్ ధర కిలోకు రూ. 52.87గా ఉంది. ఒక నెల క్రితం ఇది రూ. 37.02గా ఉండేది. కేవలం 30 రోజుల్లోనే 43 శాతం ధరలు పెరిగాయి.

Read Also: Pakistan – UAE: పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చిన ముస్లిం దేశం.. వీసాల జారీపై నిషేధం!

రాష్ట్రాల వారీగా చూస్తే దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో టమాటా ధరలు ఎక్కువగా ఉన్నాయి. దీని కారణం దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పంట ఉత్పత్తి ఎక్కువగా ఉండటమే. అండమాన్ నికోబార్ లో కిలో టమాటా రూ. 96.67గా ఉంది. మిజోరాంలో రూ. 92.18, ఢిల్లీలో రూ. 80గా ఉంది. మణిపూర్, సిక్కింలలో వరసగా రూ. 78.4, రూ. 71.67గా ఉంది. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలలో కిలో టమాటో ధర వరసగా రూ. 31.36, రూ. 38.46గా ఉంది.

క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్స్ కూడా టమాటా ధరల్ని విపరీతంగా పెంచాయి. ఢిల్లీలో బ్లింకిట్‌లో టమాటాలు కిలోకు రూ. 110కి, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో, జెప్టోలలో వరసగా రూ. 96, రూ. 92గా ఉంది. భారాన్ని తగ్గించడానికి, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF) ఢిల్లీలో కిలోకు రూ.52 చొప్పున టమోటాలు అమ్మడం ప్రారంభించింది

Exit mobile version