Site icon NTV Telugu

Congress: పహల్గామ్ ఉగ్ర దాడితో కాంగ్రెస్లో విభేదాలు.. పార్టీ లైన్ దాటొద్దన్న ఏఐసీసీ

Cng

Cng

Congress: పహల్గాం ఉగ్రదాడితో కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు చెలరేగుతున్నాయి. పహల్గాం దాడి తర్వాత మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. ఇంటలిజెన్స్ లో సాధారణంగా లోపాలు జరుగుతుంటాయి.. ప్రతి ఒక్కరు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. యుద్దం ముగిసే వరకు జవాబుదారీతనం అడగకూడదని అన్నారు. ఏ దేశం కూడా వందశాతం ఇంటలిజెన్స్ ను సేకరించలేదని తెలిపారు. ఇక, ఇజ్రాయెల్ పై జరిగిన అక్టోబర్ 7వ తేదీ నాటి దాడులతో వీటిని పోల్చారు ఎంపీ శశిథరూర్.

Read Also: Single Trailer : శ్రీవిష్ణు ‘సింగిల్’ ట్రైలర్ రిలీజ్..

కాగా, శశిథరూర్ తీరుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఉదిత్ రాజ్ మాట్లాడుతూ.. పార్టీ పట్ల ఆయనకు ఉన్న విధేయతను ప్రశ్నించారు. శశిథరూర్ తన పార్టీ కాంగ్రెస్ తరఫున మాట్లాడుతున్నారా? లేక అధికార భారతీయ జనతా పార్టీతో ఉన్నారా? అని అనుమానం వ్యక్తం చేశారు. శశిథరూర్ ‘‘సూపర్ బీజేపీ మనిషి’’గా మారడానికి ప్రయత్నిస్తున్నారా? అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆయనను బీజేపీ ప్రతినిధిగా నియమించిందా? అని అడిగారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన 26/11 ముంబై దాడులను భద్రతా లోపాలుగా గతంలో బీజేపీ తీవ్రంగా విమర్శించిందనే విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు ఇదే నిఘా వైఫల్యాలను ఆయన సమర్థించడాన్ని ఖండించారు. నిఘా లోపాలను కప్పి పుచ్చడానికి బదులుగా పీఓకేను తిరిగి తీసుకోవాలని కేంద్రానికి సూచించమన్నారు ఉదిత్ రాజ్.

Read Also: Menstrual Problems: రుతుక్రమం సమయంలో బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా? ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి!

ఇక, కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాలపై రంగంలోకి దిగింది ఏఐసీసీ.. పార్టీ లైన్ కి విరుద్ధంగా వ్యాఖ్యలు చేసిన నాయకులను అంతర్గతంగా మందలించినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్ర దాడి అంశంపై ఎవరు కూడా బహిరంగ ప్రకటనలు చేయవద్దని కాంగ్రెస్ నాయకత్వం సోమవారం పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఒక్క నాయకుడు పార్టీ ప్రకటించిన వైఖరికి కట్టుబడి ఉండాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

Exit mobile version