NTV Telugu Site icon

Kalyan Banerjee: పీకేని టార్గెట్‌ చేసిన టీఎంసీ ఎంపీ..

ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిషోర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ క‌ళ్యాణ్ బెన‌ర్జీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి రాజకీయ వ్యూహాలు అందించి.. మరోసారి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడానికి కీలకంగా పనిచేసిన న ఐ-ప్యాక్‌ అధినేత ప్రశాంత్ కిషోర్‌ను టార్గెట్‌ చేస్తూ.. ఎంపీ కల్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఒక రాజ‌కీయ పార్టీని రాజ‌కీయ పార్టీలాగే న‌డ‌పాల‌ని, రాజ‌కీయ పార్టీని ఓ కాంట్రాక్టర్ న‌డ‌ప‌లేడ‌ని ఎద్దేవా చేశారు. తాను ఎంపీగా ఉన్న ప్రాంతంలో మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అడ్మినిస్ట్రేష‌న్ బోర్డుకు నియామ‌కాల‌పై తన‌ను ఎన్నడూ సంప్రదించ‌లేద‌ని, బోర్డ్ ఆఫ్ అడ్మినిస్ట్రేట‌ర్స్‌కు ఐప్యాక్ ప‌లువురిని నియ‌మించింద‌ని.. దానిపై ప్రజ‌ల‌కు తాను వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుందని మండిపడ్డారు.

Read Also: YS Sharmila: కేసీఆర్‌ జోక్‌ బాగుంది.. బంగారు తెలంగాణ ఎక్కడుంది..?

కాగా, ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఎంసీ విజ‌యంలో ప్రశాంత్ కిషోర్ రాజ‌కీయ వ్యూహ‌కర్తగా కీల‌కంగా వ్యవ‌హ‌రించారు. ప్రజ‌ల ముంగిటే ప్రభుత్వం, బెంగాల్ త‌న కూతురినే కోరుకుంటోందనే.. లాంటి నినాదాలతో మరోసారి టీఎంసీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన వ్యూహాలు ఎంతోపనిచేశాయి.. ఇక, ఆ తర్వాత.. జాతీయ స్థాయిలో ఫ్రంట్‌ వ్యూహాల్లో మునిగిపోయారు పీకే.. ఆయన సూచనల మేరకు.. టీఎంసీ.. ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించే పనిలో పడిపోయారు మమతా బెనర్జీ.. కానీ, ఇలాంటి సమయంలో టీఎంసీ ఎంపీ… పీకేపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.