Abhishek Banerjee: మమతా బెనర్జీ అల్లుడిని నడిరోడ్డు మీద ఉతికేసిండ్రు.. బట్టలు చింపి, రాళ్లు, గుడ్లతో కొట్టి రచ్చ రచ్చ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కలకలం రేగింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అగ్రనేత, ఎంపీ అభిషేక్ బెనర్జీపై సోనార్‌పూర్‌లో ఊహించని విధంగా దాడి జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. అసలేం జరిగిందంటే.. సోనార్‌పూర్‌లో పర్యటిస్తున్న సమయంలో ఎంపీ అభిషేక్ బెనర్జీపై ఒక్కసారిగా దాడి జరిగింది. పరిస్థితిని గమనించిన ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. క్షణాల వ్యవధిలో అభిషేక్‌ను చుట్టుముట్టి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
“దొంగ.. దొంగ” అంటూ బీజేపీ నినాదాలు
పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా సోనార్‌పూర్‌లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండలో గాయపడిన బాధితులను పరామర్శించడానికి వెళ్లిన తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ (టీఎంసీ) ఎంపీ అభిషేక్ బెనర్జీపై శనివారం కొందరు దాడి చేశారు. డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఉన్న బెనర్జీపై రాళ్లు, గుడ్లు విసిరారు. అంతేకాకుండా, కొందరు వ్యక్తులు ఆయనపై చెంపదెబ్బ కొట్టడానికి ప్రయత్నించి, కాళ్లతో తన్నారు. పార్టీలో నంబర్ 2గా పరిగణించే ఆయనపై ఈ దాడి జరగడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.
Also Read
ఇదే సమయంలో అక్కడ పెద్ద ఎత్తున మోహరించిన భారతీయ జనతా పార్టీ (BJP) కార్యకర్తలు టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీని టార్గెట్ చేస్తూ తీవ్ర నిరసనలకు దిగారు. ఆయనను ఉద్దేశించి “దొంగ.. దొంగ” (చోర్.. చోర్) అంటూ గట్టిగా నినాదాలు చేస్తూ ముట్టడించే ప్రయత్నం చేశారు. మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడైన అభిషేక్ బెనర్జీపై నడిరోడ్డుపై దాడి జరగడం, అదే సమయంలో బీజేపీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించడంతో సోనార్‌పూర్‌లో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. టీఎంసీ, బీజేపీ కార్యకర్తల పోటాపోటీ చర్యలతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. పశ్చిమ బెంగాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ ఘటనతో పొలిటికల్ వార్ మరింత ముదిరింది.
తాజావార్తలు
-
MVSR College : దాండియా వేడుకలో ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. ముగ్గురు అరెస్ట్
-
Hyderabad Fake Snacks Raid: పిల్లలు తినే స్నాక్సేనా ఇవి.? కాటేదాన్‌లో 55 టన్నులు సీజ్.!
-
Fake Number Plates: నకిలీ నంబర్ ప్లేట్లకు చెక్.. 100 వాహనాలు సీజ్.!
-
Yadadri Thermal Plant : యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లో మరో కీలక ఘట్టం
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
ట్రెండింగ్
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!