TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్‌లో మమత బెనర్జీ విధేయులు..

  • మమతా బెనర్జీకి భారీ షాక్..
  • నమ్మిన వారే తిరుగుబాటు..
  • రెబల్ క్యాంప్‌లో యూసుఫ్ పఠాన్, శత్రఘ్ను సిన్హా..
Tmc Crisis

Tmc Crisis

TMC Crisis: మమతా బెనర్జీకి వరస షాక్‌లు తగులుతున్నాయి. ఎమ్మెల్యేల తర్వాత, ఎంపీలు కూడా తిరుగుబాటు చేశారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే మమతకు ఎవరైతే విధేయులుగా ఉన్నారో వారే తిరుగుబాటు వర్గంలో ఉన్నారు. ఈ పరిణామాలతో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) విభజన స్పష్టంగా తెలుస్తోంది. శత్రుఘ్న సిన్హా, యూసుఫ్ పఠాన్‌లు కూడా రెబల్ వర్గంలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 19 మంది ఎంపీలు టీఎంసీ తిరుగుబాటువర్గంగా మారారు. వీరంతా ఇప్పటికే లోక్‌సభ స్పీకర్‌కు లేఖ సమర్పించి, ఎన్డీయేకు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. టీఎంసీకి మొత్తం 28 మంది ఎంపీలు ఉంటే, ఇప్పుడు 9 మంది మాత్రమే మమత వైపు ఉన్నారు. ఇప్పటికే టీఎంసీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేల్లో 64 మంది ఎమ్మెల్యేలు రీటబ్రత బెనర్జీకి మద్దతుగా ఉన్నారు.

తిరుగుబాటు చేసిన ఎంపీలు వీరే:

1. శత్రుఘ్న సిన్హా (అసన్సోల్)
2. కకోలి ఘోష్ (బరాసత్)
3. జగదీష్ చంద్ర బసునియా (కూచ్ బెహార్)
4. ఖలీలుర్ రెహమాన్ (జంగీపూర్)
5. యూసుఫ్ పఠాన్ (బహరంపూర్)
6. అబు తాహిర్ ఖాన్ (ముర్షిదాబాద్)
7. పార్థ భౌమిక్ (బరాక్‌పూర్)
8. బాపి హల్దార్ (మథురాపూర్)
9. సాయోని ఘోష్ (జాదవ్‌పూర్)
10. మాలా రాయ్ (కోల్‌కతా సౌత్)
11. మితాలీ బాగ్ (ఆరాంబాగ్)
12. దీపక్ అధికారి (ఘటాల్)
13. కలిపాడ సోరెన్ (ఝార్‌గ్రామ్)
14. జూన్ మాలియా (మేదినీపూర్)
15. అరూప్ చక్రవర్తి (బంకురా)
16. షర్మిలా సర్కార్ (వర్ధమాన్ ఈస్ట్)
17. అసిత్ కుమార్ మాల్ (బోల్పూర్)
18. శతాబ్ది రాయ్ (బీర్భూమ్)
19. రచనా బెనర్జీ (హూగ్లీ)

×
×
Ad

మమతా బెనర్జీ వర్గంలో ఉన్న వారు:

1. మహువా మోయిత్రా (కృష్ణానగర్)
2. సౌగతా రాయ్ (దమ్‌దమ్)
3. ప్రతిమ మండల్ (జయ్‌నగర్)
4. అభిషేక్ బెనర్జీ (డైమండ్ హార్బర్)
5. సుదీప్ బందోపాధ్యాయ్ (కోల్‌కతా నార్త్)
6. ప్రసూన్ బెనర్జీ (హౌరా)
7. సజ్దా అహ్మద్ (ఉలుబేరియా)
8. కీర్తి ఆజాద్ (బర్ధమాన్–దుర్గాపూర్)