NTV Telugu Site icon

Salman Khan: బాబా సిద్దిఖీ హత్యతో సల్మాన్ ఖాన్కు భద్రత పెంపు..

Salman

Salman

Salman Khan: ఎన్సీపీ (అజిత్‌ పవార్‌ వర్గం) సీనియర్‌ నేత, బాంద్రా మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. సిద్ధిఖీ హత్యతో రాజకీయవర్గాలతో పాటు బాలీవుడ్​ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. బాబా సిద్ధిఖీకి సన్నిహితుడైన బాలీవుడ్​ హీరో సల్మాన్ ఖాన్ ​కు ప్రమాదం పొంచి ఉందనే వార్తలు వస్తున్నాయి. లారెన్స్​ బిష్ణోయ్​​ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టులో సల్మాన్ ఖాన్ పేరును సైతం ప్రస్తావించారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, అండర్ వరల్డ్ డాన్‌‌‌‌ దావూద్ ఇబ్రహీం, అనుజ్ థాపన్​తో సిద్ధిఖీకి ఉన్న సాన్నిహిత్యమే ఆయన హత్యకు కారణమన్నారు. సల్మాన్ ఖాన్, దావూద్ గ్యాంగ్‌‌‌‌కు ఎవరు సహాయం చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే అని హెచ్చరకలు జారీ చేశారు.

Read Also: Jammu and Kashmir: అర్థరాత్రి జమ్మూ కాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత

అయితే, అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ​ఖాన్ ​కు భారీ భద్రతను పెంచింది. ఆయన కుటుంబ సభ్యులకు కూడా భద్రతను కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో తన సినిమా షూటింగ్​ షెడ్యూల్స్ తో పాటు వ్యక్తిగత మీటింగ్స్ అన్నింటినీ సల్మాన్ ఖాన్ క్యాన్సిల్ చేసుకున్నారు. కాగా, ఆదివారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ ఇంటికి సల్మాన్ ఖాన్ వెళ్లారు.. ఆయనకి నివాళి అర్పించి, బాంద్రాలోని తన ఇంటికి వెళ్లిపోయారు.

Show comments