Site icon NTV Telugu

Bihar Elections: రేపే బీహార్‌ ఫలితాలు.. ‘టైగర్ జిందా హై’తో వెలసిన పోస్టర్లు

Bihar

Bihar

రేపే బీహార్ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 8 గంలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ పత్రాలు లెక్కింపు ఉండగా.. అనంతరం ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ఇక ఢిల్లీ పేలుడు నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర ఈవీఎంలకు గట్టి భద్రతా ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి: Wedding Attack: పెళ్లిలో షాకింగ్ ఘటన.. వరుడిపై కత్తి దాడి.. నిందితుల్ని 2 కి.మీ వెంటాడిన డ్రోన్

బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ జరిగింది. ఇక మంగళవారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో అన్ని సర్వేలు ఎన్డీఏ కూటమికే పట్టం కట్టాయి. దీంతో అధికార కూటమిలో ఫుల్ జోష్ నెలకొంది. మరోసారి అధికారంలోకి రాబోతున్నట్లుగా తెలియడంతో పెద్ద ఎత్తున సంబరాలకు సిద్ధపడుతున్నారు. ఇంకోవైపు స్వీట్లు, బాణాసంచా సిద్ధం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: US: అమెరికాలో ముగిసిన షట్‌డౌన్‌.. బిల్లుపై ట్రంప్ సంతకం

ఇదిలా ఉండగా తాజాగా నితీష్ కుమార్‌కు సంబంధించిన పోస్టర్లు పాట్నాలో వెలిశాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అయినా కూడా పోస్టర్లు వెలుగుచూశాయి. ‘టైగర్ జిందా హై’తో నితీష్ కుమార్ పోస్టర్లు వెలిశాయి. తిరిగి అధికారంలోకి రాబోతున్నామంటూ సూచిస్తూ కార్యకర్తలు పోస్టర్లు వేశారు.

బీహార్ ప్రజలు నితీష్-మోడీ అభివృద్ధి కోసం ఓటు వేశారని కేంద్రమత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. 2010 అసెంబ్లీ ఎన్నికలలో సాధించిన దానికంటే కూడా ఎన్డీఏ 206 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతిపరుడని, అందువల్ల వారికి ఓటు వేయడానికి ఎవరూ ఇష్టపడరన్నారు.

ఇక సర్వేలను మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తిరస్కరించారు. కచ్చితంగా రాష్ట్రంలో మార్పు జరుగుతుందని తెలిపారు. శుక్రవారం సర్వేల అంచనాలు తారుమారు అవుతాయని చెప్పారు. నవంబర్ 18న ప్రమాణస్వీకారం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

Exit mobile version